యోగ ముద్రలు వాటి ప్రయోజనాలు
యోగ సాధనలో ముద్రలు కూడా ఒక భాగం. కేవలం చేతి వేళ్ళను విభిన్న పద్దతులలో కలిపి ఉంచడం ద్వారా విభిన్న ప్రయోజనాలు పొందవచ్చు. శరీరంలో ప్రవహించే విద్యుద్ శక్తిని చైతన్యం చేయడానికి, వివిధ అవయవాలను ఉత్తేజం చేసి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ యోగ ముద్రలు ఉపయోగపడతాయి.
తద్వారా శక్తి ప్రవాహం శరీరం అంతటా వ్యాప్తి చెంది ఒకానొక అనిర్వచనీయమైన స్థితికి తీసుకెళ్తాయి ఈ ముద్రలు. ప్రకృతి పంచభూతాల కలయిక ఎలాగైతే అంటారో శరీరంలో కూడా పంచభూతాల కారకాలు ఉంటయై. వాటిని ముద్రలు ద్వారా నియంత్రించుకోవచ్చు.
దీనివల్ల శరీరం సమతుల స్థితిలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ యోగ మరియు ధాన్యంలో 100 కంటే ఎక్కువ ముద్రలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది.
యోగాసనాలు వాటి ఉపయోగాలు
అయితే వాటిలో కూడా శక్తివంతమైన పది ముద్రలు, వాటి ప్రయోజనాలు మీకోసం.
జ్ఞాన ముద్ర

ఇది ధ్యానం చేసేవారు ఎక్కువగా ఉపయోగించే ముద్ర. ఎక్కువ మంది జ్ఙాన ముద్రలోనే ధ్యానంలో ఉండటం గమనించవచ్చు. ఈ జ్ఞాన ముద్ర వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల ఏ పని అయినా మంచి ఫలితాలను ఇచ్చేలా చేయగలుగుతారు.
అంతేకాదు జ్ఞాన ముద్రను ఆచరించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నపుడు దాన్ని సాధించడానికి జ్ఞాన ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది. యోగులు, ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా లీనమై ఉండేవారు ధ్యానముద్రనే ఉపయోగిస్తుంటారు.
పద్ధతి: చేతి బొటనవేలి చివర మరియు చూపుడు వేలి చివర్లను కలిపి ఉంచడం ద్వారా ఈ ముద్రను వేయచ్చు. మిగిలిన మూడు వేళ్ళను వంచకుండా స్ట్రెయిట్ గా ఉంచాలి.
బుద్ధ ముద్ర

గౌతమ బుద్ధుడు ధ్యానం లో ఉపయోగించిన ఈ ముద్ర బుద్ధ ముద్రగా పిలవబడుతోంది. మానసిక ప్రశాంతత కోసం ఉపయోగించబడుతుంది. మానసిక వత్తిడి, ఆందోళన వంటి డిప్రెషన్ కారకాల ను తగ్గించుకోవడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది.
అంతర్గత మరియు బాహ్య స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్ మెరుగుపరచడంలో ఈ ముద్ర చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది కూడా జ్ఞాన ముద్ర లాగే అనిపిస్తుంది. కానీ రెండు వేరు వేరు ప్రయోజనాలు చేకూరుస్తాయి.
విధానం:- చేతి బొటనవేలి కొనను, చూపుడు వేలి కొనను కలిపి ఉంచి మిగిలిన వేళ్ళను స్ట్రెయిట్ గా ఉంచి మోచేతిని మడిచి పైకి ఎత్తాలి. ఈ ముద్ర మన భారతీయ హిందూ
శూన్య ముద్ర

అంతర దృష్టిని పెంచి చురుకుదనాన్ని మరియు శరీరంలో ఇంద్రియ శక్తులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే భావోద్వేగాలను మరియు ఆలోచనలను తగ్గించి మనిషిలో దృఢచిత్తాన్ని పెంపొందిస్తుంది.
పద్ధతి:- చేతి మధ్య వేలు కొనను, బొటనవేలు కొనను రెండింటిని కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్ళను స్ట్రెయిట్ గా ఉంచాలి.
ప్రాణ ముద్ర

శరీరంలో నిద్రాణమైన శక్తిని మేల్కొలిపి అంతర్గత సామర్థ్యాలు వెలికి తీసేందుకు ప్రాణ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. వ్యక్తిగత స్పృహను ఉత్తేజం చేసి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం, ప్రకృతి ఇలా అన్నింటితో అనుసంధానం చేస్తుంది.
విధానం: – ఉంగరపు వేలు, చిటికెన వేలు చివర్లను మరియు బొటన వేలు చివరను కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్ళను స్ట్రెయిట్ గా ఉంచాలి.
ధ్యాన ముద్ర

ధ్యాన ముద్ర లోతైన ఏకాగ్రతలోకి తీసుకెళ్తుంది. ఇది బాహ్య ప్రపంచంలో మన ప్రాముఖ్యతను, మన అంతర్గత ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. ప్రశాంతతను తీసుకొస్తుంది.
విధానం:- రెండు అరచేతులను పైకి చూస్తూ, కుడి చేతి మీద ఎడమ అరచేతిని ఉంచి విశ్రాంతిలో ఉండాలి.
సూర్య ముద్ర

సూర్య ముద్ర శరీరంలో అగ్ని మూలకాన్ని పెంచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని అధిక బరువును తగ్గించడంలో మరియు జలుబును నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
విధానం:- ఉంగరపు వేలు మడిచి బొటనవేలు సహాయంతో ఒత్తి ఉంచాలి. మిగిలిన వేళ్ళను స్ట్రెయిట్ గా ఉంచాలి.
అపాన ముద్ర

అపాన ముద్ర మానసిక లేదా శారీరక జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మంచిది.
విధానం:- మధ్య వేలు మరియు ఉంగరపు వేలి చివర్లను బొటనవేలు చివర్లతో కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్ళను స్ట్రెయిట్ గా ఉంచాలి.
గణేశ ముద్ర

ఇదేదో దేవుడికి చెందినది అనుకుంటే పొరపాటు. చూడటానికి అచ్చం వినాయకుడి ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. కష్ట సమయాల్లో ఉన్నపుడు సానుకూలత కలగడానికి, ధైర్యాన్ని తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుంది.
ఈ ముద్రను చేయడం ద్వారా, దృష్టిని మరియు శక్తిని గుండె కేంద్రంలోకి తీసుకువస్తారు, ఊపిరితిత్తులు, గుండె పటిష్టం అవుతాయి. గుండె కండరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరియు శరీర ఉద్రిక్తతలను నియంత్రణలో ఉంచుతుంది.
విధానం:- రెండు చేతులు మడిచి ఛాతీకి దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు చేతులను ఒకదానికొకటి ఎదురుగా విరుద్ధంగా ఉంచి ఒక ఎడమ చేతి వేళ్ళతో కుడి చేతి వేళ్ళను గట్టిగ పట్టుకుని లాగాలి. వాటిని పంజా లాగా సగం వంగిన స్థితిలో ఉంచాలి.
వాయు ముద్ర

శరీరంలో వాయు సంబంధిత సమస్యలు అనగా వాతం నొప్పులు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు మొదలైన కడుపుకు సంబంధించిన సమస్యల నివారణకు వాయు ముద్ర చాలా మంచిది.
పద్ధతి:- చూపుడు వేలిని మడిచి బొటన వేలి సహాయంతో చూపుడు వేలిని నొక్కి పత్తి ఉంచాలి. చాలామంది జ్ఞాన ముదర్సకు వాయు ముద్రకు తేడా తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే వాయు ముద్ర బొటన వేలితో చూపుడు వేలిని నొక్కి పట్టి ఉంచేది. జ్ఞాన ముద్ర బొటన వేలు, చూపుడు వేలు చివర్లను కలిపి ఉంచేది.
రుద్ర ముద్ర

ఇది మీ అంతర్గత పరివర్తన సామర్ధ్యాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వ్యక్తిగత శక్తి కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఆలోచన ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. తరచుగా ఈ ముద్రను వేస్తుంటే మైకము, అలసట మరియు దీర్ఘకాలిక ఉద్రిక్తతతో ఇబ్బంది పడే వాళ్లకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అత్యున్నత సామర్థ్యాన్ని లేదా లక్ష్యాలను చేరుకోవడానికి తమని తాము శక్తివంతం చేసుకోవడానికి రుద్ర ముద్రను ఉపయోగించవచ్చు.
విధానం:- బొటనవేలు,చూపుడు మరియు ఉంగరపు వేళ్ల చివర్లను కలిపి ఉంచాలి. మిగిలిన రెండు వేళ్ళను స్ట్రెయిట్ గా ఉంచాలి.
Aslo Check:- ఈ చిన్ని చిట్కాలే మీ అధిక బరువును తగ్గించే సులభ మార్గాలు