Table of Contents
యోగ అంటే ఏమిటి ?? యోగ ఉపయోగాలు ఏమిటి??
భారతదేశ ప్రజలకు వారసత్వ సంపదగా లభించిన గొప్ప మార్గం యోగ. ఇది ఎంతో ప్రాచీన కాలపు పద్దతి అయినప్పటికీ గత రెండు మూడు దశాబ్దాల కాలం నుండి ఆరోగ్య స్పృహ పరంగా ప్రతి ఒక ఆరోగ్య నిపుణుడు యోగ ను రిఫర్ చేస్తున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా మార్చే యోగ పరిస్థి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరం. యోగ గురించి, యోగ ఉపయోగాలు గురించి మీకోసం వివరంగా.
యోగా అంటే ఏమిటి ?
ప్రతి ఒక్కరికి యోగ వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని తెలుసు కానీ అసలు యోగ అంటే ఏమిటి?? అని అడిగితే సమాధానం చెప్పేవారు చాలా తక్కువ. కొందరు అయితే శరీరాన్ని వంచుతూ ఆసనాలు చేయడం యోగ అనుకుంటారు. నిజానికి ఆసనాలు అనేవి యోగ లో ఒక భాగం మాత్రమే.
ప్రతిరోజు మనం అన్నం తిన్నట్టు, ఉద్యోగం చేసినట్టు మొక్కుబడిగా గంట సేపు యోగ ఆసనాలు వేసి యోగ చేసేసాం అనుకుంటే తప్పకుండా పొరపాటు అవుతుంది. జీవితంలో ఆధ్యాత్మిక సాధన మార్గంలో వెళ్లి యోగ గురించి లోతుగా తెలుసుకుని, యోగ అంటే ఒక పద్ధతి కాదు జీవితంలో అదొక నిరంతర సాధన అని తెలిపిన వారు ఉన్నారు.
చాలా మంది దీనిని పురాతన శిక్షణా పద్ధతి అని పిలుస్తారు, ఇతరులు దీనిని కష్టమైన భంగిమల కలయిక అని పిలుస్తారు. కానీ ‘యోగా’ అనే పదానికి నిజానికి యూనియన్ అని అర్థం. అంటే మనస్సును, శరీరాన్ని, ఆత్మను అన్నిటినీ సంధానం చేసే ప్రక్రియ యోగ.
ప్రఖ్యాత యోగి, సద్గురు జగ్గీ వాసుదేవ్ యోగాను “జీవిత వ్యక్తీకరణ” అని పిలుస్తారు. అంటే మన ఉనికిని, మనం ఏమి చేస్తున్నాం?? ఎలా ఉంటున్నాం?? ఎలా ఉండాలి?? వంటివి అంతర్లీనంగా మనకు మనం తెలుసుకునేలా చేసేది యోగ. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆత్మవిమర్శ, ఆత్మ విశ్లేషణ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించేది యోగ.
వాస్తవికతను చూసే మరియు అనుభవించే స్థితికి తీసుకురావడానికి ఇదొక అద్భుత మార్గం. శరీరాన్ని శరీరంలో ఇంద్రియాలను, అవి వాటి కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించేలా చేయడం యోగ ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. మనసు, శరీరం రెండు పరస్పర సహకారంతో ఉంటే జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది.
యోగా వల్ల ప్రయోజనాలు ఏమిటి?
యోగా ఒక అభ్యాసంగా లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంది, శారీరకంగా మరియు మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా యోగా మనిషిని శక్తివంతంగా తయారుచేసి వ్యక్తి పరిపూర్ణత్వం వైపుకు తీసుకెళ్తుంది. యోగ ప్రయోజనాలు రెండు రకాలుగా ఉంటాయి.
యోగా అంతర్గత ఆరోగ్య ప్రయోజనాలు
యోగాను ప్రతి రోజు ఆచరించడం వల్ల కొద్ది రోజుల్లోనే కింది మార్పులు గమనించవచ్చు.
◆ మెరుగైన రక్త ప్రసరణ

యోగా చేసే మొదటి పని రక్త ప్రసరణను మెరుగుపరచడం. దీని అర్థం శరీరమంతా ఆక్సిజన్ మరియు పోషకాల మెరుగైన రవాణా. మెరుగైన రక్త ప్రసరణ వల్ల అవయవాల ఆరోగ్యం మరియు చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
◆ అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది

క్రమం తప్పకుండా యోగాను అభ్యసించినప్పుడు, శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుటుంది. శరీరం ప్రశాంతంగా ఉండడంతో రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.
◆ పల్స్ రేట్ ను సక్రమంగా ఉంచుతుంది

యోగా శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది, వివిధ కారణాల వల్ల శరీరం ఒత్తిడికి లోనైనపుడు గుండెకొట్టుకునే వేగం పెరుగుతూ ఉంటుంది. యోగ వల్ల దీన్ని సక్రమంగా ఉండేలా చేయచ్చు.
◆ శ్వాస నియంత్రణ

యోగా మొత్తం నియంత్రిత శ్వాసను కలిగి ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
◆ అవయవాలు చైతన్యం పొందుతాయి

యోగాను అభ్యసించినప్పుడు, అంతర్గత అవయవాలు ఉత్తేజం పొందుతాయి. తద్వారా వ్యాది నిరోధశక్తి పెరుగుతుంది. శరీరం దృఢంగా తయారవుతుంది.
◆ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆరోగ్యంలో మెరుగుదల

క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గిపోతాయి. , అజీర్ణం, గ్యాస్ మరియు ఇతర కడుపు సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.
◆ లైంగికత శక్తిని పెంచుతుంది

యోగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది శరీరానికి చైతన్యాన్ని, మానసిక విశ్రాంతిని ఇవ్వడం వల్ల శరీరంలో ఆరోగ్య కణజాలం, హార్మోన్ల పనితీరు మెరుగవతాయి. ఫలితంగా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
◆ నిద్ర

మనస్సు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి యోగా సహాయపడుతుంది. ఇది అనవసరమైన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. తద్వారా మంచి నిద్రను సులభతరం చేస్తుంది.
బాహ్య ఆరోగ్య ప్రయోజనాలు
అంతర్గత శరీర అనుభవాలు మనం అనుభూతి చెందగలం. అయితే యోగా బాహ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. యోగ చేకూర్చే బాహ్య ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు.
◆ అకాల వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది

యోగా శరీరాన్ని డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది, తద్వారా టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ తొలగిస్తుంది. గొప్ప యాంటీ ఏజింగ్ ప్రక్రియగా పనిచేసి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి కూడా సహాయపడుతుంది.
యోగా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, ఒత్తిడి తగ్గడం వల్ల మనసు మరియు శరీరం అలసిపోవడం తగ్గుతుంది. తద్వారా హార్మోన్ల విడుదల ఆరోగ్యంగా ఉంటుంది.
◆ శరీరం కంఫర్టబుల్ గా తయారవుతుంది

యోగ లో ఆసనాలు ఒక భాగం. ప్రతిరోజు వీటిని ఆచరించడం వల్ల శరీరంలో ప్రతి అవయవం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. దీనివల్ల ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు లాంటివన్ని తగ్గిపోయి శరీరం తేలికగా ఉంటుంది
◆ బరువును నియంత్రిస్తుంది

యోగాసనాలు వివిధ భంగిమలలో ఉండటం వల్ల వాటిని ఆచరించేటపుడు ఆయా భాగాల్లో పెరిగిన పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. దీనివల్ల శరీర సౌష్టవం అద్భుతంగా మారుతుంది. అధిక బరువుతో ఉన్నవారు యోగ సాధన చేయడం వల్ల జిమ్ కు వెళ్ళేదానికంటే మంచి పలితాన్ని చాలా తొందరగా పొందుతారు.
ఇది కూడా చదవండి :- యోగా ముద్రలు – వాటి ప్రయోజనాలు