Weight Loss Tips In Telugu : బరువు తగ్గడానికి చిట్కాలు
అధిక బరువు అనర్థ దాయకం. ప్రస్తుత కాలంలో బిజీ బిజీ జీవితాలు. ఉదయం ఎప్పుడో ఇంటి నుండి బయట పడితే రాత్రి ఎప్పుడో తిరిగి ఇంటికి చేరడం. ఇంటిదగ్గర ఏదో ఒకటి వండి బాక్స్ లో వేసుకుని వెళ్లినా భోజనము సమయానికి అది చల్లారిపోవడం, వెంటనే క్యాంటీన్లకు లేదా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ వైపు మనసు మల్లుతుంది.
తరువాత సాయంత్రం స్నాక్స్ పేరుతో నూనెలో వేగిపోయిన చిప్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, బర్గర్లు, పిజాలు. వాటి కాంబినేషన్ కోసం కూల్ డ్రింక్స్ వీటి నుండి శరీరానికి అందే కొలెస్ట్రాల్, అందులో చక్కెర శాతం, కేలరీలు కొండలా శరీరంలో చేరిపోతాయి.
వీటి పర్యావసనమే ప్రస్తుతం జనాభాలో ఎక్కువ శాతం మంది అధికబరువుతో సతమతం అవ్వడానికి కారణం. చాలామంది బరువు తగ్గాలంటే మొదట చేసే పని తినడం మానేస్తారు. కానీ దానివల్ల ఇంకా బరువు పెరుగుతారనే విఆహాయం వాళ్లకు అర్థం కాదు.
How to Lose Weight In Telugu
మరి బరువు తగ్గాలంటే ఏమి చెయ్యాలి?? కింది టిప్స్ ఫాలో అవ్వాలి అంతే!!
◆ టిఫిన్ స్కిప్ చేయకూడదు

చాలామంది ఉదయం పూట టిఫిన్ ఎగ్గొట్టేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదం. బరువు తగ్గడం అంటే కడుపులో మిగిలిపోయిన కేలరీలు కరిగిస్తూ సరిపడినంత ఆహారం తీసుకోవాలి.
రాత్రి మొత్తం నిద్రలో ఉన్నపుడు ఎక్కువసేపు శరీరానికి ఆహారం అందదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అయితే ఎక్కువ కేలరీలు లేకుండా ఉండే బ్రేక్ఫాస్ట్ ను తీసుకోవడం వల్ల అధికబరువును బ్రేక్ చేయచ్చు.
◆ రోజూ భోజనం తినాలి

బరువు తగ్గడం కోసం ఇంకొందరు చేసే పని అన్నం తినడం మానేయడం. రోటీలు, పుల్కాలు తింటే బరువు తగ్గుతామని అనుకోవడం కూడా అపోహ మాత్రమే.
రోటీలు, పుల్కాలను లెక్కబెట్టుకుని తిన్నట్టే అన్నం ను కూడా తినేముందు ఒక చిన్న గిన్నెను కొలతగా పెట్టుకుని లెక్కబెట్టుకుని తినచ్చు. భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రుల శరీర తత్వానికి అన్నమే ప్రాణాధారం.
◆ పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి

పండ్లు కూరగాయలు బాగా తినమని ప్రతి ఒక్కరూ చెబుతారు. దానికి కారణం పండ్లు, కూరగాయల్లో సహజసిద్ధమైన చెక్కెరలు, తాజా విటమిన్లు, పోషకాలు ముఖ్యంగా ఫైబర్ మరియు నీటి శాతం సమృద్ధిగా ఉంటాయి.
కేలరీలు కూడా చాలా తక్కువ. వీటివల్ల కడుపు నిండిన భావన తొందరగా చేకూరుతుంది, మరియు ఆకలిని ఎక్కువసేపు నియంత్రించగలుగుతాయి.
◆ చురుగ్గా ఉండాలి

అధిక బరువు ఉన్నవారిలో బద్దకం ఎక్కువ. అందుకే చురుకుగా ఉండటం బరువు తగ్గడానికి మరియు దానిని దూరంగా ఉంచడానికి ముఖ్యమైంది. ప్రతిరోజు కనీస సమయంలో వ్యాయామం, నడక ఇంకా ఆసక్తిని బట్టి ఆటలు, పిల్లలతో కలసి ఆడుకోవడం వంటివి ఫాలో అయితే చురుగ్గా ఉండచ్చు. అంతేకాదు రోజంతా చురుగ్గా ఉండటానికి అద్భుతమైన చిట్కా ఉదయాన్నే లేవడం. సూర్యుడి లేత కిరణాలను ఆస్వాదించడం.
◆ నీరు బాగా త్రాగాలి

శరీరంలో అవయవాలు చురుగ్గా పనిచేయాలి అంటే నీరు ఎంతో అవసరం. నీరు నీటిలో లవణాలు కూడా శరీరంలో ఫాట్ ను కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదయాన్నే పరగడుపున దాదాపు లీటర్ నీటిని తగలడం వల్ల పేగులలో పేరుకుపోయిన ఫాట్ ను కరిగించడం సులువు అవుతుంది.
◆ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

అధికబరువు ఉన్నవారికి గొప్ప వరం ఫైబర్ నిండిన ఆహారపదార్థాలు. ఇవి ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తాయి. మెల్లిగా జీర్ణం అవుతాయి, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. . పండ్లు మరియు వెజిటేబుల్స్, వోట్స్, బ్రౌన్ రైస్, పొట్టు తీయని ధాన్యాలు, గింజలు మొదలైనవి వాడటం ఉత్తమం.
◆ కేలరీలు లెక్కించడం

ప్రతి పదార్థం ఇంత మోతాదులో తీసుకుంటే ఇన్ని కేలరీలు లభిస్తాయి అనేది చాలా చోట్ల గమనిస్తూ ఉంటాము. ఏ పదార్థాల్లో ఎంత శాతం ఫైబర్ ఉంది, ఎంత శాతం చెక్కెరలు ఉన్నాయి, ఎంత శాతం కొవ్వు పదార్థాలు ఉన్నాయి అనేవి వీటి ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీటివల్ల రోజుకు తీసుకోవలసిన ఆహారాన్ని కేలరీలు వారిగా విభజించుకుంటే బరువును ఐస్ లా కరిగించేయవచ్చు.
◆ చిన్న ప్లేట్ లో తినడం

కాస్త నవ్వు తెప్పించేలా అనిపించవచ్చు కానీ ఇది చాలా మంచి ట్రిక్. పెద్ద ప్లేట్ లో బోలెడు పెట్టుకుని తినేటప్పుడు ఆహారం చాలా తినేస్తాము. బరువు తగ్గడానికి మరియు పెరగకుండా ఉండటానికి నిపుణులు సూచించే ముఖ్యమైన అంశం చిన్న మొత్తాలలో ఎక్కువ సార్లు తినడం. అందుకే చిన్న ప్లేట్ పెట్టుకుంటే రోజులో ఆహారాన్ని నాలుగు నుండి ఐదు సార్లు తిన్నా పర్లేదు.
అలాగే కడుపు నుండి మెదడుకు ఉన్న అనుసంధాన వ్యవస్థ దృష్ట్యా కడుపు నిండిన విషయం మెదడు గ్రహించాడు కాస్త సమయం పడుతుంది. అందుకే ఆహారాన్ని మెల్లిగా నమిలి తినాలి.
◆ ఇష్టమైన ఆహారాన్ని మానకూడదు
బరువు తగ్గాలని అనుకున్నప్పుడు చాలామంది ఇష్టమైన కొన్ని ఆహారపదార్థాలను పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఇది ఖచ్చితంగా తప్పే. ఇష్టమైన ఆహారరాలు తీసుకోవచ్చు అయితే పరిమితిలో మాత్రమే.
దీనివల్ల మనసు కాస్త తృప్తి చెందుతుంది. అన్ని తింటున్నామనే నిశ్చింత ఉంటుంది. ఆందోళన ఏదో కోల్పోతున్నాం అనే భావన బరువు పెరగడానికి కారణం అవుతుంది సుమా!!
◆ జంక్ ఫుడ్ కు ఎప్పుడూ దూరం ఉండాలి

అధికబరువుకు 80% కారణం జంక్ ఫుడ్ అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అదే నిజం. వాటి అమ్మకాలు ఏ రేంజ్ లో ఉన్నాయో బయట పుట్టగొడుగుల్లా వెలుస్తున్న షాప్ లు, వాటి చుట్టూ మూగే జనం సాక్ష్యం.
చాక్లెట్, బిస్కెట్లు, నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, శీతల పానీయాలు ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఒకవేళ ఇలాంటివి తినాలని అనిపిస్తే హెల్తి గా మరియు ఉప్పు చక్కెర వంటివి మితంగా వాడుతూ ఇంట్లోనే చేసుకుని తినడం మంచిది.
◆ డైట్ ప్లానింగ్ మ్యాజిక్ చేస్తుంది

చాలా బద్ధకంగా అనిపించవచ్చు ఇలా ప్లాన్ చేయడం. కానీ వారానికి ఒకసారి మీరు ఏ రోజు ఏ ఆహారాన్ని తీసుకోవాలి. టిఫిన్ ఏమిటి?? భోజనం ఏమిటి?? వంటి వాటిని కెలోరీలు వారిగా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైన రీతిలో బరువు తగ్గడం మొదలుపెడతారు.
ఈ చిట్కాలు పాటిస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీర బరువు ను చాలా సులువుగా తగ్గించవచ్చు. మరి ఇవే కాకుండా బరువు పెరగాలంటే ఎం తినాలో టిప్స్ ఉన్నాయి. అవి కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో టిప్స్ మా సైట్ లో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు పొడి దగ్గు నివారణ మార్గాలు , గ్యాస్ సమస్య నివారణ మార్గాలు లాంటి టిప్స్ ఉన్నాయి.
ఇలాంటి మరెన్నో ఇంటి చిట్కాలు కోసం తప్పకుండా ఈ సైట్ ని ఫాలో అవ్వండి. మీ సందేహాలను తీర్చుకోండి.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.