బరువు తగ్గించే శక్తివంతమైన ఎక్సర్సైజ్ లు
అధిక బరువు బలే బేజారు. ఆ బరువును తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. వాటిలో తిండి మానేసి నోరు కట్టేసుకోవడం దగ్గర నుండి అందరూ చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ చేసేయడం వరకు. ఎన్నో తంటాలు పడుతుంటారు. అయితే బరువు తగ్గడానికి కాస్త ఓపిక తెచ్చుకుని కింద చెప్పుకునే వ్యాయామాలు ఫాలో అయితే బరువు క్రమంగా కరిగిపోయి ఫిట్ గా మారిపోతారు.
బరువు తగ్గడానికి అందరూ చేయగలిగే వ్యాయామాలు
◆ వాకింగ్

బరువు తగ్గడానికి ఉత్తమ వ్యాయామాలలో వాకింగ్ ఒకటి. ఏ వ్యాయామం మొదలు పెట్టాలన్న అందుకు శరీరాన్ని సన్నద్ధం చేయగలిగేది వాకింగ్ మాత్రమే. దీనికోసం ఎలాంటి పరికరాలు అవసరం లేదు, ఎలాంటి ప్రత్యేక శిక్షకులు అవసరం లేదు.
వాకింగ్ కాళ్ళను మాత్రమే కాదు శరీరాన్ని అంతటిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే నడక ఒక మంచి మ్యాజిక్ చిట్కా లాగా పనిచేస్తుంది బరువు తగ్గాలి అనుకునేవారికి.
ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఆహ్లద సమయంలో 5 లేదా 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ రోజుకు కనీసం గంటసేపు నడవడం వల్ల ఊహించని రీతితో బరువు తగ్గవచ్చు. అది కూడా మొదట మెల్లిగా మొదలుపెట్టి క్రమంగా నడక వేగాన్ని పెంచుకుంటూ పోవచ్చు.
◆ జాగింగ్ లేదా రన్నింగ్

బరువు తగ్గడానికి జాగింగ్ మరియు రన్నింగ్ గొప్ప వ్యాయామాలు. జాగింగ్ మరియు రన్నింగ్ ఒకేలా అనిపించవచ్చు కానీ అందులో వేగం మాత్రమే తేడా కాదు అవి ఇచ్చే పలితాలు కూడా వేరువేరుగా ఉంటాయి. జాగింగ్ మరియు రన్నింగ్ సాధారణంగా పొట్ట భాగంలో ఉండే హానికరమైన విసెరల్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి.
గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి వివిధ దీర్ఘకాలిక వ్యాధులను ఈ కొవ్వులు కలిగిస్తాయి. అందుకనే జాగింగ్, రన్నింగ్ చేసేవాళ్లకు గుండెజబ్బుల ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతూ ఉంటారు.
అయితే జాగింగ్, రన్నింగ్ చేయడానికి అనువుగా మంచి షూస్ ఎంపిక చేసుకోవాలి, ఇంకా పచ్చిక పెరిగిన ప్రాంతాలలో పార్కులలో జాగింగ్ చేయడం చాలా మంచిది దీనివల్ల కాలి ఎముకల మధ్య కీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటాయి.
◆ సైక్లింగ్

చిన్నతనంలో సైక్లింగ్ అనేది ఆటలో ఒక భాగం. మరియు దినచర్యలో కూడా భాగం. పెద్దయ్యే కొద్దీ మోటార్ వెహికల్స్ వైపు వెళ్లి ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే సైకిల్ ను మూలన పెట్టేసామ్. సైక్లింగ్ అనేది బరువు తగ్గించి శరీర ఫిట్నెస్ ను పెంచే గొప్ప వ్యాయామం.
సైక్లింగ్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది మరియు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మరణ ప్రమాద రేటు చాలా తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు సైక్లింగ్ చేయడం వల్ల అధికంగా కేలరీలు ఖర్చు చేయడానికి సాధ్యమవుతుంది. దీర్ఘకాలిక సమస్యలను కూడా దీని ద్వారా అధిగమించవచ్చు.
◆ వెయిట్ ట్రైనింగ్

బరువు తగ్గాలని చూసే వ్యక్తులకు వెయిట్ ట్రైనింగ్ అనేది మంచి ఎంపిక. ఇది ప్రత్యేకంగా ఒకరి పర్యవేక్షణలో జరిగే ప్రక్రియ కాబట్టి ఎలాంటి బద్దకం లేకుండా క్రమశిక్షణతో జరిగిపోతుంది. తద్వారా నిర్ణీత సమయంలో బరువు తగ్గడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏ భాగాల్లో కొవ్వు అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాలకు అనువుగా బరువులు ఎత్తడం ద్వారా తగ్గించుకోవచ్చు.
అంతేకాదు బరువులు ఎత్తడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. కండరాల పనితీరు మెరుగుపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది.
ఇది కూడా చదవండి :- ఈ చిన్ని చిట్కాలే మీ అధిక బరువును తగ్గించే సులభ మార్గాలు
◆ ఈత

బరువు తగ్గడానికి మరియు మంచి శరీర సౌష్టవం పొందడానికి ఈత ఒక ఆహ్లాదకరమైన మార్గం. ఇదొక శక్తివంతమైన బరువును తగ్గించే ప్రక్రియగా గుర్తించబడింది. ప్రతిరోజు నిర్ణీత సమయంలో ఈత కొట్టడం వల్ల అధిక కేలరీలు ఖర్చు చేయవచ్చు. అంతే కాకుండా నీటిలో శరీరంలోని శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తాం కాబట్టి అన్ని భాగాల్లో పేరుకున్న కొవ్వు సులువుగా తగ్గిపోతుంది.
ఈత వల్ల కలిగే మరొక గొప్ప ప్రయోజనం ఇది శరీరంలోని కీళ్ల పైన ప్రభావితం చేయదు. కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కాకపోతే ఈత కొట్టేటపుడు చెవులలో, ముక్కులలో నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
◆ సూర్యనమస్కారాలు

యోగాలో భాగమైన సూర్యనమస్కారాలు గొప్ప ప్రభావవంతమైనవి. ఇవి ఆరు యోగాసనాలు కలిపి రెండు విధాలుగా మిలితమైన అద్భుతమైన వ్యాయామం అని చెప్పవచ్చు. శరీరంలో అన్ని అవయవాలను ఉత్తేజం చేసి రోగనిరోధకశక్తిని పెంచగల ప్రత్యేకత వీటి సొంతం.
అలాగే వీటిని పూర్తిగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేస్తుంటారు కాబట్టి ఆ సమయాల్లో సూర్యుని లేత కిరణాలు శరీరానికి గొప్ప ప్రయోజనాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా విటమిన్ డి శరీరమంతా ప్రసరిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. పొట్ట, నడుము, తొడలు, పిరుదులు వంటి భాగాలలో కొవ్వు కారకంగా కరిగిపోయి అద్భుతమైన శరీర సౌష్టవం సొంతమవుతుంది.
◆ స్కిప్పింగ్

చిన్నతనం ఆటల్లో భాగమైన స్కిప్పింగ్ అమ్మాయిలకు అందరికి పరిచయమే అయినప్పటికీ ఇదొక వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అని చాలా మందికి తెలియదు. తాడు సహాయంతో చేసే ఈ వ్యాయామం శరీర కండరాలను దృఢంగా చేసి అధిక కేలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా చేస్తుంది.
సినీతారలు తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకుని తాము తీసుకునే ఆహారంలో అదనపు కేలరీలు ఖర్చు చేయడానికి ఉపయోగించే వ్యాయామాలలో స్కిప్పింగ్ తప్పనిసరిగా ఉంటుంది. పది నిమిషాల స్కిప్పింగ్ గంట వాకింగ్ తో సమానం.
కేవలం అమ్మాయిలకు మాత్రమే కాకుండా అబ్బాయిలు, సినీ నటులు ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు, అథ్లెటిక్స్ ఇలా ప్రతి ఒక్కరు మన చిన్నతనం నటి తాడు ఆటను రోజులో భాగం చేసుకుని ఉంటారు.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.
ఇది కూడా చదవండి :- సన్నగా ఉన్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి చాలు 10 రోజుల్లో షాక్ అవుతారు