Weight Gain Tips In Telugu 2021 : బరువు పెరగడానికి చిట్కాలు
అధిక బరువు ఎంత ఇబ్బంది పెడుతుందో వయసుకు, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం కూడా అంతే ఇబ్బంది. ఎంత తింటున్న బరువు పెరగడం లేదని బాధపడేవారు చాలామంది. అయితే ఎంత తింటున్నాం అనేదానికంటే శరీరం పుష్టిక ఉండటానికి బరువు పెరగడనికి ఏమి తినాలి?? అనేది తెలుసుకుని తినడం ఉత్తమం.
సాదారణంగా మనుషులు సన్నగా ఉన్నా శరీరం దృఢంగా ఉంటే పర్లేదు కానీ, శరీరం దృఢంగా లేకపోతే బలహీనత వల్ల శరీరంలో నరాలు, కండరాలు, ఎముకలు కూడా బలహీనమయ్యి చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఎక్కువ బాధపడిపోతారు.
అమ్మాయిలు అయితే ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే కనీసం పెళ్లి వయసు వచ్చినపుడు అయిన బరువు పెరగాలని తెగ సతమతం అవుతుంటారు.
అయితే బరువు పెరగడం అనేది బరువు తగ్గడం కంటే కష్టమైన పనే కానీ అసాధ్యం అయితే కాదు. కింద సూచించే ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.
How To Gain Weight Naturally In Telugu : బరువు పెరగడానికి శరీరానికి పుష్టినిచ్చే పదార్థాలు
◆ ప్రతిరోజు స్నాక్స్ పేరుతో అడ్డమైన తిండి తినకుండా బాదం, అక్రోట్లను, వేరుశెనగ, బెల్లం. నువ్వుల లడ్డులు, ముఖ్యంగా మినప సున్ని ఉండలు మొదలైనవి తింటూ ఉండాలి. మినప లడ్డులు శరీరాన్ని ఉక్కుగా మార్చిసి అమితమైన బలాన్ని ఇస్తాయి.

◆ డ్రై ఫ్రూట్స్: ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, కాజు, మరియు, వాల్నట్స్ వంటివి తింటూ ఉండాలి.

◆శరీరం పుష్టిగా మారాలి అంటే పలు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పెరుగు, జున్ను, మీగడ తీయని పాలు, స్వచ్ఛమైన పాలతో తయారుచేసిన తీపి పదార్థాలు మొదలైనవి తీసుకోవచ్చు.

◆ కొవ్వులు మరియు నూనెలు: వంటల కోసం వాడే నూనెలో రిఫైండ్ ఆయిల్స్ లో పుష్టికరమైన కొలెస్ట్రాల్ ఉండదు. గానుగ ఆడించిన నూనెలు శరీరానికి మంచి కొవ్వులను అందిస్తాయి. స్వచ్ఛమైన వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఎంతో ఉత్తమమైనవి.

◆ అన్ని రకాల ధాన్యాలు సమృద్ధిగా తీసుకోవచ్చు. ముఖ్యంగా పొట్టు తీయకుండా ఉండాలి. ఇప్పట్లో ధాన్యాల నుండి లభ్యమయ్యే పిండి కూడా శుద్దిచేయబడి ఎలాంటి పోషకాలు లేకుండా తయారవుతున్నాయి. కాబట్టి అలాంటి వాటికి దూరం ఉండాలి.

◆ మాంసాహరం శరీరానికి కండర పుష్టిని తొందరగా అందివ్వగలవు. అందులో కొవ్వు అహతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేపలు, చికెన్ వంటివి తీసుకోవచ్చు.

◆కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే పదార్థాలు కూడా కండరాలకు కావలసిన శక్తిని అందిస్తాయి. కండర నిర్మాణానికి ఇవి ఎంతగానో అవసరం. దుంప కూరగాయల్లో వీటిని పుష్కలంగా పొందవచ్చు. బంగాళాదుంపలు, చిలగడదుంపలు బాగా తీసుకోవాలి.

◆ డార్క్ చాక్లెట్, కొబ్బరి పాలు, నెయ్యి తో తయారు చేసిన పదార్థాలు, వంటివి తీసుకోవడం మంచిది. పైన చెప్పుకున్న పదార్థాలు తీసుకోవడమే కాకుండా కొన్ని చిట్కాలు కూడా పాటించాలి అవేమిటో కూడా చూడండి.

◆ భోజనానికి ముందు నీళ్లు తాగకూడదు. ఇది ఆహారం తక్కువ తినడానికి కారణం అవుతుంది. కాబట్టి తినేముందు మరియు, తినేటప్పుడు నీళ్లను తక్కువ తాగాలి.
◆ దాహం వేసినప్పుడు సాదారణంగా అందరూ చేసే పని నీళ్లు తాగడం. అయితే నీటి బదులు పాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల మంచి నాణ్యమైన ప్రోటీన్ శరీరానికి అందుతుంది.

◆ బరువు పెరడానికి మరొక మంచి మార్గం మిల్క్ షేక్‌లను ప్రయత్నించడం. వీటి ద్వారా ఎక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి తద్వారా బరువు కూడా పెరుగుతారు. అరటి, మామిడి, సపోటా, డ్రై ఫ్రూట్స్, వంటి కాంబినేషన్ లలో మిల్క్ షేక్స్ మంచి పుష్టిని కలిగజేస్తాయి.
◆ పాలు, పెరుగు వంటివి ఉపయోగించేటపుడు అందులో వెన్న తీయకూడదు. తద్వారా మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి.
◆ నాణ్యమైన నిద్ర కూడా బరువు పెరగడానికి అవసరమే. కండరాల పెరుగుదలకు సరిగా నిద్రపోవడం చాలా ముఖ్యం. పడుకునే ముందు గ్లాసుడు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.

◆ టిఫిన్ లేదా భోజనం చేసేటప్పుడు కేలరీలు అధికంగా ఉండే వాటిని మొదట తీసుకోవాలి. దీనివల్ల శరీర అవయవాలకు తగినంత శక్తి సులువుగా చేరుతుంది.
◆ ప్రతిరోజు ఉదయాన్నే పాలలో తేనె కలుపుకుని తాగి రెండు అరటిపళ్ళు తినాలి. దీనివల్ల తొందరగా బరువు పెరగచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే గుడ్లలో పచ్చ సొన శరీర కండర నిర్మాణానికి ఉపయుక్తం. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఈ టిప్స్ అన్ని బరువు తక్కువగా ఉంది కొంచెం లావు అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం. మరి ఎవరైనా అధిక బరువు ఉండి సన్నగా కావాలంటే టిప్స్ ఉన్నాయి. క్లిక్ చేసి తెలుసుకోండి.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.