Skin Care Tips In Telugu 2021 : చర్మ సంరక్షణ కోసం చిట్కాలు ( బ్యూటీ టిప్స్ తెలుగులో )
ఆరోగ్య సంరక్షణలో చర్మసంరక్షణ కూడా ఒక భాగం. మృదువైన, మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ నివసించే ప్రాంతాలు, వాతావరణం, తీసుకునే ఆహారం, ఉపయోగించే ఉత్పత్తులు, ముఖ్యంగా మనిషి మానసిక స్థితి కూడా శరీర చర్మం మీద ప్రభావం చూపిస్తాయి.
సమ్మర్ వింటర్ కాలం ఏదైనా చర్మాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం మనదే. అయితే చర్మ సంరక్షణ కోసం అద్భుతమైన మరియు సులువైన చిట్కాలు మీ కోసం చూసేయండి మరి.
చలికాలంలో చర్మ సంరక్షణ కోసం చిట్కాలు

చలికాలం అనగానే వణుకు గుర్తొస్తుంది. చాలికలపు హంగామా అంతా ఇంతా కాదు. అయితే చలికాలంలో కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుకోవచ్చు.
◆ కాలం ఏదైనా నీళ్లు బాగా తీసుకోవాలి. చాలామందికి నీళ్లు ఎక్కువ తాగితే టాయిలెట్ కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగడం తగ్గిస్తారు. శరీరానికి సరిపడినంత నీటిశాతం ఉంటేనే చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. లేకపోతే చాలా తొందరగా పొడిబారిపోతుంది.
◆ చలికాలంలో అందరూ చేసే పని వ్యాజలైన్ మరియు మార్చరైజింగ్ క్రీములు వాడటం.

వీటివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుందేమో కానీ చర్మ రంద్రాలు మూసుకుపోయి శరీరం నుండి విడుదల అవ్వాల్సి చెమట మలినాలుగా పేరుకు పోయి మొటిమలు, మచ్చలు ఏర్పడటానికి కారణం అవుతాయి. అందుకే చలికాలంలో చర్మం పొడిబారకుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వాడటం శ్రేయస్కరం.
◆ చర్మ సంరక్షణలో దుస్తులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను బయటకు పోనివ్వకుండా చేసే ఉన్ని దుస్తులు చలికాలంలో మంచి ఎంపిక.
◆ శరీరానికి సోప్ అందరికి అలవాటు. చాలాకాలం వస్తే అందులో కూడా వెరైటీలు వాడేస్తారు. అలా కాకుండా చక్కగా శనగపిండి, లేదా నలుగు పిండి, సున్ని పిండి వాడటం వల్ల చర్మం ఎంతో నునుపుగా మారుతుంది.

స్నానానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఒళ్ళంతా మర్దనా చేసుకుని శనగపిండి ఉపయోగించి స్నానం చేస్తే వేల ఖరీదు చేసే ఉత్పత్తులు కూడా శరీర సౌందర్యానికి వెలవెలబోతాయి.
◆ చలిగా ఉంది కదా అని మరీ ఎక్కువ ఎండలో కూర్చోకూడదు. దీనివల్ల చర్మం దెబ్బ తింటుంది. అందుకే ఏ కాలం అయినా యెడయాన్నే సూర్యుడి లేలేత కిరణాలను ఆస్వాదించడం ఉత్తమం.
◆ విటమిన్ ఇ, విటమిన్ డి చర్మ సంరక్షణకు ఎంతో ముఖ్యం. కాబట్టి అవి ఆహారం ద్వారా మరియు వివిధ రూపాల్లో శరీరానికి అందేలా చేసుకోవాలి.
◆ నూనెతో కూడిన ఉత్పత్తులు చలికాలంలో చర్మం పొడిబారకుండా చేస్తాయి. అలాగే గ్లిజరిన్ తో కూడిన ఉత్పతులు కూడా.
ఇవన్నీ పాటిస్తే చలికాలంను కూడా చక్కగా ఆస్వాదించవచ్చు.
ఇది కూడా చదవండి :- గర్భవతులు ఆరోగ్యంగా బరువు పెరగడానికి చిట్కాలు
వేసవిలో చర్మ సంరక్షణ కోసం చిట్కాలు

◆ వేసవి అంటే ఉక్కపోత. అందుకే పలుచగా ఉన్న దుస్తులు ధరించడం మంచిది. కాటన్ దుస్తులు వేసవికి వండర్ లా అనిపిస్తాయి.
◆చెమట అధికంగా పట్టే ఈ కాలంలో చెమతను పీల్చుకోగల దుస్తులు ఉత్తమం.
◆నీరు బాగా తాగాలి. ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి. విపరీతమైన ఎండకు శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే అవకాలు ఉంటాయి కాబట్టి. నీటి శాతం అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి.

◆ రోజులో మూడు సార్లు ముఖాన్ని కడుక్కోవాలి. అలాగని అదేపనిగా ఫేస్ వాష్ లు, సోప్ లు వేయకూడదు.
◆ ఏ పనులు అయినా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది.
◆ అత్యవసరంగా ఎక్కువ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లడం ఉత్తమం
◆ చల్లని బట్టతో సున్నితంగా ముఖం, చేతులు, కళ్ళు తుడుచుకోవచ్చు. దీనివల్ల ఎండకు కమిలిన చర్మానికి కాస్త ఊరట లభిస్తుంది.
◆ ఎలాంటి కెమికల్స్ లేని రోజ్ వాటర్ ఎండకు కమిలిన చర్మానికి మంచి ఔషదంలా పనిచేస్తుంది.
◆ వేసవిలో జ్యుస్ లు ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇంట్లోనే జ్యుస్ లు తయారుచేసుకునేవారు జ్యుస్ ను వడగట్టగా మిగిలిన పిప్పిని పడేయకుండా అందులో కాసింత ముల్తానీ మట్టి, పసుపు జోడించి ముఖానికి చేతులకు పాక్ లా వేసుకుంటే అందమైన మెరుపుతో కూడిన చర్మం సొంతమవుతుంది.

◆ వేసవిలో ఆయిల్ ఫ్రీ ఉన్న ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. లేకపోతే జిడ్డు కోట్టుకుని బయటి దుంమి ధూళికి తొందరగా నలుపు రంగులోకి మారిపోతుంది.
చలికాలం అయినా వేసవి కాలం అయినా పనులు మాత్రం ఆగవు కాబట్టి వాటికి సన్నద్ధమవ్వడం ముఖ్యం. ముక్యంగా కాలానికి తగ్గట్టు చర్మ సంరక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసేముందు చర్మ తత్వం ఎలాంటిదో ఒకసారి తెలుసుకుని తరువాత కొనడం మంచిది.
లేకపోతే డబ్బు వృధా మరియు చర్మం డామేజ్ అయ్యి కళావిహీనం అవుతుంది. నేచురల్ ఉత్పత్తుల వైపు వెళ్లడమే అన్ని కాలాలలో మంచి మార్గం.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.
ఇది కూడా చదవండి :- బరువు తగ్గడానికి చిట్కాలు