Sesame Seeds In Telugu Meaning : నువ్వులు
భారతీయులు ప్రాచీన కాలం నుండి వాడుతున్న పదార్థాల్లో నువ్వు ప్రథమ స్థానంలో ఉన్నాయి. వంటల్లో ఉపయోగించడం నుండి మనిషి చనిపోయాక పిండప్రధానాల వరకు అన్నింటిలో నువ్వుల పాత్ర పెద్దది.
నువ్వులు సాదారణంగా రెండు రకాలు. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఆయుర్వేదం శాస్త్రంలో నువ్వులకు గొప్ప స్థానం నుండి, నువ్వుల నుండి లభ్యమయ్యే నూనె ఆవకాయ పెట్టడానికి కొన్ని ప్రాంతాల్లో వంటలు చేయడానికి ఉపయోగించడం మనకు తెలిసినదే.
అలాంటి నువ్వులలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్ ఎ, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9. విటమిన్ సి, విటమిన్ ఈ. మరియు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ మొదలైన బోలెడు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని చాలా బలంగా తయారు చేస్తాయి.
How To Eat Sesame Seeds In Telugu : నువ్వులు ఎలా తినాలి??
సాధారణంగా మనం తినే సోపు గింజలు , జీలకర్ర, అవిసె గింజలు లాగానే నువ్వులు కూడా తింటాము.మరి అతి ఏదైనా మంచిది కాదు. అందుకే ఇక్కడ నువ్వులు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

◆ నువ్వులను వేయించి బెల్లం జతచేసి బాగా దంచి చలిమిడిలాగా తినవచ్చు. వయసులో వచ్చిన ఆడపిల్లలకు ఇది పెట్టడం సంప్రదాయం కూడా. దీని ఉదేశ్యం నడుము గట్టిపడుతుంది, ఐరన్ పుష్కలంగా అందడం వల్ల రక్తం భర్తీ అవుతుంది.
◆ నువ్వులు దోరగా వేయించి బెల్లం పాకంలో వేసి లడ్డులుగా చేసుకుని తినవచ్చు.
◆ డ్రై ఫ్రూట్స్ తో కలిపి ఎనర్జీ బార్స్ గా తయారు చేసుకోవచ్చు.
◆ నువ్వుల పొడిని పులిహోరలో జోడించవచ్చు. నువ్వుల పచ్చడి, నువ్వుల పొడి జత చేసిన కూరలు తయారుచేసుకోవచ్చు.
◆ తెల్ల నువ్వుల నుండి నూనెను తీయగా మిగిలిన పిప్పిని తెలగపిండి పేరుతో అమ్ముతారు. దీంతో కూర వండుకుని తింటారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ కూర చాలా బలవర్థకమైనది.
◆ ఇవన్నీ కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే పళ్ళు తోమి నోరు శుభ్రం చేసుకున్న తరువాత పరకడుపున స్పూన్ నువ్వులను నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి తినాలి. దీనివల్ల శరీరం మొత్తం శుద్ధి అవుతుంది. పంటి సమస్యల నుండి జీర్ణసమస్యల వరకు అన్ని తగ్గిపోతాయి.
Sesame Seeds Benefits : నువ్వుల నూనె ఉపయోగాలు

◆ నువ్వులను గానుగ పట్టించడం లేదా మిషన్ కు వేయడం ద్వారా తయారుచేసే నువ్వుల నూనె, అన్ని నూనెలలోకెల్లా ఉత్తమమైనది.
◆ దీన్ని ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
◆ ఊరగాయలు పెట్టడంలో నువ్వులనూనే కచ్చితంగా ఉండాల్సిందే. ఇది వేడి చేసి గుణాన్ని కలిగి ఉంటుంది. ఆవకాయ లేదా ఊరగాయ లో వేసే ఆవపిండితో చర్యజరిపి జీర్ణాశయాన్ని, జీర్ణాశయంలో జఠర రసాలను తగినంతగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
◆ నువ్వుల నూనెను ఉపయోగించి తయారు చేసిన ఆహారం తినడం వల్ల శరీరంలో రక్తం శుద్ది అవుతుంది.
◆ ఈ నూనెను పక్షవాతం వచ్చిన రోగులకు బాగా ఉపయోగిస్తారు. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల పక్షావాతానికి గురయ్యి బిగుసుకుపోయిన నరాలు క్రమంగా వదులుగా మారతాయి.
◆ నువ్వుల నూనెను ఒళ్ళంతా పట్టించుకుని కొద్దిసేపు ఆగిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చర్మకాంతి మెరుగవుతుంది. చర్మసంబంధ సమస్యలు అన్ని తగ్గిపోతాయి. చర్మం నునుపు సంతరించుకుని ముడుతలను మాయం చేస్తుంది.
◆ ఇక నువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాల్లో 90% నువ్వుల నూనెను వాడటం వల్ల కూడా కలుగుతాయి.
Sesame Seeds Side Effects In Telugu : దుష్ప్రభావాలు

నువ్వులు మరియు నువ్వుల నూనెతో లాభాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి.
◆ రక్త చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది
రక్తం యొక్క గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో నువ్వులు ప్రయోజనకరమైన ఆహార పదార్థంగా గుర్తింపబడ్డాయి. నువ్వుల గింజలలో ఉండే ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ వల్ల ఇది సాధ్యమవుతుంది,
ఇది శరీరం యొక్క ఇన్సులిన్ నిరోధకతను మరింత తగ్గిస్తుంది, తద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలలో చక్కెరలను విచ్ఛిన్నం చేస్తుంది. అయితే నువ్వులను పరిధికి మించి తీసుకుంటే రాజతంలో చక్కర స్థాయిలు అనూహ్యంగా తగ్గి ప్రమాదాన్ని కలిగిస్తాయి..
◆ తక్కువ రక్తపోటు కలిగిస్తుంది
నువ్వులు అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి మార్గం. అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు క్రమంగా తగ్గిస్తాయివి. నువ్వుల గింజలలో ఉండే ఖనిజాలు రక్తప్రవాహంలో చేరే అధిక ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.
అదే వీటిని ఎక్కువ తీసుకుంటే శరీరం నీటిని గ్రహించే సమర్త్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయేలా చేయడం, శరీరాన్ని డీహైడ్రేట్ కు గురిచేయడం చేస్తుంది.
◆ అపెండిసైటిస్‌కు కారణం కావచ్చు
అపెండిసైటిస్ అనేది కడుపులో వచ్చే సమస్య. ఇది తీవ్రమైన కడుపునొప్పిని కలిగిస్తుంది. నువ్వుల గింజలలో ఉండే ఫైబర్స్, జీర్ణమయ్యే ఇతర ఆహారపదార్థాలను కలుషితం చేయడం ద్వారా ఇది మొదలవుతుంది.
ఇది క్రమంగా పేగు సమస్యకు దారి తీస్తుంది. నువ్వులను ఎక్కువ తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ పదార్థాలు అపెండిక్స్ పై పొరను దెబ్బతీస్తాయి, ఇది ఉబ్బరం మరియు నొప్పిని కలిగిస్తుంది.
◆ అనాఫిలాక్సిస్ లేదా శ్వాశ లో ఇబ్బంది
నువ్వులను ఎక్కువగా తీసుకుంటే కనిపించే అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్ లేదా నువ్వుల అలెర్జీ కూడా ఒకటి. వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, షాక్ గా అనిపించడం వంటి వివిధ లక్షణాలు సాధారణంగా ఎదురవుతుంటాయి.
◆ మహిళల్లో నెలసరి సమస్యలు పెంచుతుంది
అప్పటికే నెలసరి సమస్యలతో బాధపడేవారు నువ్వులకు దూరంగా ఉండాలి. ఇవి వేడి కలిగిస్తాయి. ఫలితంగా అధిక ఋతుస్రావం జరగడానికి కారం అవుతాయి. ఎలాంటి సమస్యలు లేనివారు మితంగా తినవచ్చు.