Table of Contents
గర్భధారణ అంటే ఏంటి ?
Pregnancy In Telugu : ఆడవారి జీవితంలో గర్భం అనేది అత్యంత ప్రత్యేకమైన దశ. స్త్రీ పురుషులు సంభోగం జరిపినపుడు పురుషుని వీర్యకణాలు స్త్రీ శరీరంలో ప్రవేశించి పలదీకరణ చెంది పిండంగా రూపాంతరం చెందడాన్నే గర్భధారణగా పేర్కొంటారు. 90% మహిళల జీవితాల్లో ఈ గర్భం అనేది ఎలాంటి సమస్యలు లేకుండానే వస్తుంది.
గర్భధారణ సమయం & వయసు
ఒక పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుత కాలంలో అమ్మాయిలు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, గోల్స్, అభిరుచులు వంటి కారణాలు ఎన్నో ఉండచ్చు. కానీ సరిగ్గా గమనిస్తే ప్రస్తుత కాలంలో గర్భధారణ విషయంలో సఫర్ అవుతున్నవాళ్ళు చాలా మంది ఉంటున్నారు.
ముఖ్యంగా పెద్దలు చెప్పేమాట ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని. దీన్ని చాదస్తంగా కొట్టి పడేస్తారు కానీ ఆలోచిస్తే అదే నిజమని అనిపిస్తుంది. ఆడపిల్ల గర్భవతి అయ్యి, గర్భాన్ని మోసి, సుఖంగా ప్రసవించి తిరిగి ఆరోగ్య వంతురాలుగా మారాలి అంటే 22 నుండి 26 సంవత్సరాల లోపు వయసు ఉత్తమం. ఆ సమయానికి తగిన చదువు, సరైన శరీర సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది.
గర్భం రావాలంటే ఎప్పుడు కలవాలి ? ఏం చేయాలి ?

పెళ్ళైన ప్రతి జంట శృంగారంలో పాల్గొనడం మాములే. అయితే చాలా మందికి ఎదురయ్యే సమస్య గర్భం విషయమే. తాము బాగానే ఉంటున్నాం, శృంగారంలో పాల్గొంటున్నాం అయినా గర్భం రావట్లేదు అని కంప్లైంట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటివాళ్లకు కింది టిప్స్ చక్కగా పనిచేస్తాయి.
◆ ప్రెగ్నెన్సీ రావాలంటే పురుషుని వీర్యకణాలు స్త్రీ శరీరంలో ప్రవేశించి అండాలతో కలసి పలదీకరణ చెందాలి. పురుషుల వీర్య కణాల విషయంలో ఎలాంటి నిర్ణీత సమయం లేనప్పటికీ, స్త్రీలలో అండాలు చురుగ్గా ఉండి పలదీకరణ చెందాలి.
అంటే స్త్రీ నెలసరి రావడానికి 4 లేదా 5 రోజుల ముందు మరియు నెలసరి తరువాత రక్తస్రావం ముగిశాక 5 రోజుల వరకు అంటే నెలసరికి అటు అయిదు రోజులు, మరియు ఇటు అయిదు రోజుల సమయంలో శృంగారంలో పాల్గొంటే నెలసరి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ నడుము కింద దిండు ఉంచుకోవడం వల్ల పురుషుని వీర్యం తొందరగా బయటకు వెళ్లిపోకుండా నిలిచి ఉంటుంది. దీనివల్ల 99% గర్భం రావడం ఖాయం.
ప్రెగ్నెన్సీ నిర్ధారించే మార్గాలు

◆గర్భం వచ్చిందని అంచనా వేయడానికి చాలా మంది చేసుకునే మొదటి విశ్లేషణ పీరియడ్స్ రాకపోవడం. గర్భం రావడానికి పీరియడ్స్ సక్రమంగా రావడం ఎంత ముఖ్యమో ఈ విషయం తేటతెల్లం చేస్తుంది.
◆ శరీరంలో మార్పులు మెల్లగా మొదలు అవ్వడం వల్ల తలనొప్పి, తినాలని అనిపించకపోవడం, జ్వరం వంటివి ఉండవచ్చు
◆ ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి వాటిని ఎవరికి వారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపయోగించుకుని నిర్ధారణ చేసుకోవచ్చు కూడా.
◆ ఎన్ని పరీక్షలు చేసినా చివరికి డాక్టర్ ను సంప్రదించక తప్పదు ఈ కాలంలో. కాబట్టి పీరియడ్స్ మిస్సయిన ఒక నాలుగైదు రోజులు చూసి తరువాత నేరుగా డాక్టర్స్ ను సంప్రదించడం ఉత్తమం.
ప్రెగ్నెన్సీ ప్రారంభ లక్షణాలు

కడుపులో పిండం ఏర్పడగానే అది తెలియడానికి చాలా మందికి దాదాపు ఒకటి లేదా రెండు నెలలు అవుతుంది. ప్రస్తుత కాలంలో ప్లానింగ్ చేసుకునే వారు అధికం కాబట్టి వారికి పీరియడ్స్ స్కిప్ అవ్వగానే టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ క్లియర్ అయిపోతుంది. ఇక ప్లానింగ్ లేకుండా జరిగిపోయేవారికి ఒకటి నుండి రెండు నెలల కాలంలో తెలిసిపోతుంది. ఈ ఒకటి నుండి రెండు నెలల కాలంలో శరీరం మార్పులకు లోనవ్వడం మెల్లిగా మొదలవుతుంది.
గర్భం లక్షణాలు 1st వారం
♦ వాంతులు అవ్వడం లేదా వాంతి వచ్చినట్టు అనిపించడం. కడుపులో వికారం.
♦ ఒళ్ళు జలదరించినట్టు అనిపించడం. రొమ్ములలో మార్పులు రావడం.
♦ రోజులో ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం
♦ తలనొప్పి
♦ మాములు కంటే ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత ఉండటం
♦ కడుపు ఉబ్బరం
♦ అన్నిటికి తొందరగా అలసటకు గురికావడం
నెల 1 గర్భం లక్షణాలు

♥ సాధారణంగా గర్భ నిర్ధారణ ప్రారంభమయ్యేది కూడా ఈ నెలసరి తప్పడంతోనే మొదలవుతుంది
♥ మూడ్ మారిపోవడం. కోపం చిరాకు, అసహనం వంటివి మాత్రమే కాకుండా నీరసంగా అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం
♥ కడుపు ఉబ్బరంగా ఉండటం
♥ కాళ్ళు, చేతులు మరియు ఒళ్ళు అంతా తిమ్మిరిగా అనిపించడం
♥ రొమ్ముల నిపుల్స్ చుట్టూ పుండులాగా కనిపించడం
♥ నీరసం, అలసట
2 వ నెల గర్భం లక్షణాలు
♠ ఉదయం లేవగానే హుషారు లేకపోవడం, బద్ధకంగా, నీరసంగా అనిపించడం
♠ వాంతులు అవ్వడం
♠ కడుపు ఉబ్బరం
♠ బలమైన ఆహారాలు తీసుకోలేకపోవడం మరియు వాటి మీద విరక్తి కలగడం
♠ మూత్ర విసర్జన మొదటి నెల కంటే కూడా ఎక్కువగా వెళ్లాల్సి రావడం
♠ మూడ్ మారిపోవడం. అకారణంగా ఏడుపు రావడం, తొందరగా అలసిపోవడం
♠ రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం. నొప్పిగా అనిపించడం
3 నెల గర్భం లక్షణాలు
♦ వికారం మరియు వాంతులు ఇంకా ఎక్కువ అవ్వడం
♦ తిన్నది అరగకపోవడం, తద్వారా మలబద్ధకం. గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయి. దానివల్ల గుండెల్లో మంట రావడం
♦ నిపుల్స్ వాపు రావడం, దురద మరియు నల్లబడటం వంటి రొమ్ము మార్పులు
♦ శరీరం తమ స్వాధీనంలో లేనట్టు మైకంగా ఉన్నట్టు అనిపించడం మరియు తలనొప్పి
♦ మునుపటి కంటే ఆకలి పెరుగుతుంది
♦ హార్మోనుల ప్రభావం వల్ల మానసికంగా గందరగోళం కు గురవడం
♦ యోని భాగంలో మార్పులు రావడం
4 వ నెల గర్భధారణ లక్షణాలు
♥ గ్యాస్ సమస్య ఎక్కువ అవ్వడం వల్ల గుండెల్లో మంట మరియు అజీర్ణ సమస్య కూడా ఎక్కువ అవ్వడం
♥ వెన్నునొప్పి
♥ చర్మం మీద తెల్లని చారలు ఏర్పడటం
♥ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం
♥ ముక్కు వాపు వస్తుంది, మరియు శ్వాశ నాళాలు బ్లాక్ అవ్వడం జరుగుతుంది
♥ చిరాకు ఎక్కువ అవ్వడం. చిగుళ్ల ప్రాంతంలో రక్తస్రావం జరగడం
♥ మలబద్ధకం సమస్య అధికమవ్వడం
5 వ నెల గర్భధారణ లక్షణాలు
♦ గుండెల్లో మంట
♦ కాళ్ళ తిమ్మిర్లు పెరగడం, కాళ్ళ వాపులు. కలై చీలమండలు వాపు రావడం. నడవడానికి ఇబ్బంది కావడం
♦ బరువు పెరగడం వల్ల అసౌకర్యం అనిపించడం
♦ కడుపు పరిమాణం క్రమంగా పెద్దగా అవ్వడం వల్ల వెన్ను మీద భారం పడి వెన్ను నొప్పి ఎక్కువ కావడం. ఎక్కువ సేపు కూర్చోలేకపోవడం
♦ అలసట, ఆయాసం అధికమవడం
♦ రొమ్ముల భాగంలో చర్మం మార్పులు
9 వ నెలలో డెలివరీ లక్షణాలు

♥ మూత్ర విసర్జన చేయాలనే కోరిక పెరిగిపోతుంది
♥ శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి కావడం
♥ గర్భాశయం విస్తరించడం, మరియు సన్నగా అవ్వడం
♥ నెలలు నిండిపోవడం వల్ల బరువు వల్ల కలిగే ఒత్తిడికి వెన్నునొప్పి అధికమవ్వడం
♥ గర్భాశయ కండర సంకోచాలు కలగడం
♥ శరీర శక్తి సన్నగిల్లిపోవడం, మూత్ర విసర్జనను అదుపు చేసుకోలేకపోవడం
ఇది కూడా చదవండి :- గర్భధారణ సమయంలో స్త్రీ ఎంత బరువు పెరగాలి ? ఎంత బరువు ఉండాలి ?
గర్భం పోవడానికి గల కారణాలు

సాదారణంగా నాలుగు నెలల లోపు ప్రెగ్నెన్సీ పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత సురక్షితమే. ఆ నాలుగు నెలల లోపు గర్భం పోవడానికి గల కారణాలు ఇవే.
♦ మొదటి 12 వారాలలో గర్భస్రావం జరిగినప్పుడు, సగానికి పైగా సమయం కడుపులో బిడ్డ విషయంలో క్రోమోజోమ్‌లు సమస్య గా మారతాయి. ఇవి బిడ్డ అభివృద్ధికి కారణం అవుతాయి.
♦ అయితే ఈ క్రోమోజోమ్ ల అనుసంధానం కడుపులో బిడ్డతో సరిగా లేనపుడు బిడ్డ ఎదుగుదల లేకపోవడం, ఎదుగుదలకు సరైన వాతావరణం అందకపోవడం వల్ల గర్భస్రావం జరుగుతుంది.
♦ వయస్సు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత, ఈ క్రోమోజోమ్ ల వల్ల గర్భం కోల్పోయే సమస్యలు చాలా పెరుగుతాయి
♦ గర్భం కోల్పోవడం తరచుగా తల్లి ఆరోగ్య సమస్య వల్ల కూడా వస్తుంది
♦ సైటోమెగలోవైరస్ లేదా రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్ లు
♦ డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక నియంత్రణ లేని వ్యాధులు
♦ థైరాయిడ్ వ్యాధి.
♦ గర్భాశయం లేదా గర్భాశయ సమస్యలు, గర్భాశయ పరిమాణం చిన్నగా ఉండటం.
♦ మావికి రక్త ప్రవాహాన్ని తీసుకువెళ్లే రక్త నాళాలను నిరోధించే రక్తం గడ్డకట్టే సమస్యలు
♦ జీవన శైలి కూడా గర్భస్రావానికి కారణం అవుతుంది.
♦ ధూమపానం. ఆడ, మగ ఇద్దరిలో ఎవరు చేసిన కూడా మహిళ గర్భం పెరిగే బిడ్డకు ప్రమాదం. అలాగే మద్యపానం.
♦ వైద్యుల సలహా లేకుండా మందులను ఉపయోగించడం
♦ కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం
గర్భం పోవడానికి ఏమి చేయాలి
How to avoid pregnancy naturally : చాలామంది శృంగారంలో పాల్గొనే వరకు ఆలోచన చేయరు కానీ తరువాత బాధపడుతుంటారు. ఎవరి వ్యక్తిగత కారణాలు వారికి ఉండచ్చు అయితే గర్భం పోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి వల్ల దుష్ప్రభావం లేకుండా ఉంటుంది.
◆ వేపకు వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి వేప ఆకులను జ్యుస్ చేసి తీసుకుంటే గర్భం పోతుంది. అది కష్టం అనుకునేవాళ్ళు గర్భం రాకుండా ఉండటానికి శృంగారంలో పాల్గొనేటపుడే మహిళ యోని మార్గంలో వేప నూనెను రాసుకోవడం వల్ల గర్భం రాదు. ఎందుకంటే వేప నూనె శుక్రకణాల జీవితకాలాన్ని నిర్వీర్యం చేస్తుంది.
◆ సైందవ లవణం గురించి చాలా తక్కువమందికి తెలుసు. శృంగారం లో పాల్గొన్న తరువాత ఈ సైందవ లవణం ను చిన్న కాటన్ క్లాత్ లో మూటగా కట్టి యోని మార్గంలో పెట్టుకోవాలి దీనివల్ల గర్భం రాదు.
◆ అందరం పైనాపిల్ గా పిలుచుకునే అనాసపండు గర్భం పోయేలా చేస్తుంది. అనాసపండును తింటే గర్భం పోతుంది.
◆ శరీరాన్ని ఎప్పటికప్పుడు వేడిగా ఉంచుకోవాలి. కాకరకాయ, మునక్కాయ, బొప్పాయి వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే వీర్యకణాలు తొందరగా విచ్చిన్నం అయిపోతాయి. దీనివల్ల గర్భం నిలువదు.
◆ గర్భం రాకూడదు అంటే మరొక ఉత్తమ మార్గం అండాలు చురుగ్గా ఉండే రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో శృంగారంలో పాల్గొనడం.
◆ మగవాళ్ళు శృంగారంలో పాల్గొనేటపుడు కండోమ్ ధరించడం.
అయితే ఆడవాళ్లు గర్భస్రావం కోసం ప్రయత్నిస్తే మూడు నెలల లోపు ప్రయత్నించడం అది కూడా డాక్టర్ ల పర్యవేక్షణ తప్పనిసరి. ఎందుకంటే ఇది కేవలం గర్భస్రావం చేయించుకోవడమే కాదు తల్లి ఆరోగ్యం పై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు ఇలా గర్భస్రావాలు జరగడం వల్ల భవిష్యత్తులో తల్లి అయ్యే అదృష్టాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి.
పుట్టేది బాబు లేక పాపా తెలుసుకోవడం ఎలా ??

చాలామందికి ఇదొక పజిల్. పాప పుడుతుందో, బాబు పుడతాడో అనే ఆలోచన చాలామందిలో సహజంగా ఉంటుంది. ఇది లింగ వివక్ష అనుకుంటే పొరపాటు. తెలుసుకోవాలనే కుతూహలం మాత్రమే అలా ఆలోచన కలిగేలా చేస్తుంది అంతే.
అయితే ఇప్పట్లో ఏ ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ ప్రైవేట్ క్లినిక్ లలో కానీ ఇలా కడుపులో బిడ్డ జెండర్ ను చెప్పడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. అలాంటివేమి అక్కర్లేకుండా కొన్ని పరిస్థితులను బాగా గమనించడం ద్వారా బిడ్డ జెండర్ ను అంచనా వేయచ్చు.
◆ ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ గా ఉన్నపుడు మొటిమలు, మచ్చలు, చర్మం నల్లబడటం వంటి చర్మ సమస్యలు ఎదురవుతూ ఉంటే కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల, ఇలాంటి లక్షణాలు ఏమి లేకపోతే మగపిల్లాడు అని అర్థం
◆ అమ్మాయిలు చాలా అల్లరి చేస్తారండోయ్. కడుపులో ఉన్నది పాప అయితే గర్భవతిగా ఉన్న స్త్రీ లు కూడా బాగా చురుగ్గా ఉంటారు. అదే బాబు అయితే బద్దకం ఎక్కువగా ఉంటుంది.
◆ కడుపులో ఉన్నది పాప అయితే అమ్మాయిల ముఖంలో కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అదే బాబు అయితే నిస్తేజంగా, నీరసంగా, ముఖం లో కళ తక్కువ ఉంటుంది.
◆ కడుపులో ఉన్నది అమ్మాయి అయితే పొత్తికడుపు భాగంలో కడుపు ఎక్కువగా ఉండి పైభాగంలో తక్కువగా ఉంటుంది. అదే బాబు అయితే పై భాగంలో కడుపు పెద్దగా ఉంటుంది.
ఇవండీ జెండర్ ను గుర్తించడానికి కొన్ని చిట్కాలు. స్కానింగ్ లు వంటి రేడియేషన్ కు గురయ్యే పరీక్షల వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రెగ్నెన్సీ ని ఆస్వాదించండి.
ఇవి కూడా చదవండి :-