గర్భవతులు ఆరోగ్యంగా బరువు పెరగడానికి చిట్కాలు
గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన బరువు పెరగడం కడుపులో బిడ్డ ఎదుగుదలకు ముఖ్యమైనది. చాలా మంది గర్భిణీ స్త్రీలకు బరువు పెరగడం పెద్ద సమస్య కాదు ఇది సులభంగా జరుగుతుంది. కానీ గర్భధారణ సమయంలో చాలా బలహీనంగా ఉండే మహిళలు ఉంటారు.
వాళ్లు తక్కువ బరువు ఉండటం వల్ల అనేక అనారోగ్య అసమస్యలు ఎదుర్కొంటుంటారు. ఆకలి లేకపోవడం లేదా వైద్యపరమైన సమస్యలు కూడా వాళ్లలో ఉండచ్చు. గర్భధారణ సమయంలో తగినంత బరువు పెరగకపోవడం అనేది మహిళలు తొందరగా అలసిపోవడం మాత్రమే కాకుండా కడుపులో బిడ్డ ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంటుంది.
సరైన ప్రణాళిక మరియు సరైన చిట్కాలతో అవసరమైన బరువును పెరగచ్చు. అయితే గర్భధారణకు, బరువును లింక్ కూడా ఒకసారి చూడాలి మరి.
గర్భధారణ సమయంలో స్త్రీ ఎంత బరువు పెరగాలి?

గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విపులంగా మన సైట్ లో ఉంది. దయచేసి ఒకసారి చదివి వివరాలు తెలుసుకోండి.
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆరోగ్యకరమైన పరిధిలో మహిళ 9 నుండి 13 కేజీల మధ్య పెరగడం ఆరోగ్యకరమైన పెరుగుదల అవుతుంది.
ఎత్తు మరియు గర్భధారణకు ముందు బరువు ఆధారంగా ఎంత బరువు పెరగాలి అనే విషయాన్ని ప్రతి మహిళ చెకప్ కు వెళ్ళినపుడు గైనకాలజిస్ట్ లు తెలియజేస్తారు. గర్భవతులు కింది మార్గాలు అనుసరించడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు
◆ రోజుకు ఐదు నుండి ఆరు సార్లు చిన్న చిన్న మొత్తాలలో తినడం

సాదారణంగా అందరికి అలవాటు రోజుకు మూడు సార్లు తినడం. కానీ సాధారణ రోజుల్లో శారీరకశ్రమ, శరీర స్థితి వేరు గర్భవతిగా ఉన్నపుడు శరీర స్థితి వేరు. చిన్నచిన్న పనులకు శరీరం తొందరగా అలసిపోవడం వంటివి జరుగుతుంటాయి.
అంతేకాదు శరీరంలో జరిగే మార్పుల వల్ల జీర్ణక్రియ కూడా గాడి తప్పుతుంది. అందుకనే రోజుకు చిన్న మొత్తాలలో అయిదు లేదా ఆరు సార్లు తినడం మంచిది. దీనివల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కాయలు, విత్తనాలు, కూరగాయలు మరియు మొక్కల ఉత్పత్తులైన ఆకుకూరలు, పండ్లు, పండ్ల రసాలు. అధికంగా ఉండే ప్రోటీన్ మరియు సేంద్రీయ ఉత్పత్తులు ఉండేలా చూసుకుంటే మంచి పెరుగుదల సాధ్యమవుతుంది.
◆ ఆరోగ్యకరమైన BMI

చాలామంది విషయంలో గర్భధారణ అనేది అలా జరిగిపోతుంది. కానీ ప్రస్తుత జనరేషన్ దాన్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. గర్భధారణ ప్లాన్ చేసుకునేటపుడు మహిళ ఎత్తుకు తగ్గ బరువు ఉందా లేదా అనేది చూసుకుని, అధిక బరువు ఉంటే తగ్గడం, కనీస బరువు లేకపోతే కాస్త పెరగడం వంటివి చేసుకోవడం వల్ల గర్భవతి అయ్యాక బరువు విషయంలో ఎలాంటి టెన్షన్ లు పడనవసరం లేకుండా నిశ్చింతగా ఉండచ్చు.
◆ జంక్ ఫుడ్స్ తినడం మానుకోవాలి

ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు జంక్ ఫుడ్స్. నోటికి రుచిగానూ, మంచి సువాసనతో మనసును కట్టిపడేస్తాయి అవి. బరువు ఎక్కువ లేములే అనే నెపంతో గర్భవతులుగా ఉన్నపుడు జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు.
చెడు కొలెస్ట్రాల్ లు చాలా సులువుగా శరీరంలోకి వెళ్ళిపోయి కడుపులో బిడ్డకు కూడా సమస్యలు తెచ్చిపెడతాయి. ఈ ఆహారాల నుండి ఎలాంటి పోషకాహారం లభించదు కూడా. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అనారోగ్యకరమైన బరువు పెరగడానికి దారితీస్తాయి.
అంతేకాదు ఎక్కువ కారం, మసాలా, ఉప్పు, పులుపు వంటి వాటిని తీసుకోకూడదు. ఇవి కడుపులో యాసిడ్లు పుట్టించి గ్యాస్, ఎసిడిటీ సమస్యకు కారణం అవుతాయి.
◆ డాక్టర్ ను సంప్రదించడం తప్పనిసరి

ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనుకునే విషయం కోసం దగ్గరలో డాక్టర్ ను సంప్రదించాలి. నెల నెలా చెకప్ కు వెళ్లడం ద్వారా సరైన బరువుని మైంటైన్ చేయడం సాధ్యమవుతుంది.
◆ సురక్షితమైన వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి

బరువు పెరగడం ఎంత ముఖ్యమో, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వీటి వల్ల రక్తప్రసరణ, శరీర అవయవాలు రిలాక్స్ అవ్వడం, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. శరీరంలో ఆరోగ్యకరమైన షుగర్ లెవల్స్ , మరియు బిపి లెవల్స్ ను మైంటైన్ చేయడం సాధ్యమవుతుంది.
అంతేకాదు గర్భధారణ తరువాత నుండి ప్రసవం వరకు దాదాపు తొమ్మిది నెలల కాలంలో బరువును ఎక్కువ పెరగకుండా ఉండేందుకు కూడా వ్యాయామం చక్కని ఔషధం. కడుపులో బిడ్డ కదలికలు చురుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది.
అయితే వైద్యుల సలహాతో శరీరానికి అనుగుణమైన వ్యాయామాలు చేయాలి. రోజువారీ నడక, ధ్యానం, ప్రాణాయామం తప్పనిసరిగా పాటించాలి.
◆ భోజనాన్ని ఎగ్గొట్టకూడదు

ఎట్టి పరిస్థితులలోనూ భోజనాన్ని స్కిప్ చేయకూడదు. దీనివల్ల శరీర బరువు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తినే తిండి విషయంలో కచ్చితమైన సమయవేళలు కూడా పాటించాలి.
అలాగే ఏదో ఒకటి అని సరిపెట్టుకోకుండా ఆరోగ్యకరమైన పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు శరీరం మార్పులకు లోనవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వికారం, వాంతులు అవ్వడం, తినాలని అనిపించకపోవడం, వంటివి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.