గ్యాస్ సమస్య – చిట్కాలు : గ్యాస్ చాలామందికి సాధారణ సమస్యలా అనిపిస్తుంది కానీ అనుభవించే వాళ్లకు ఇది ఎంతో ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి. ఇది ఒక జబ్బు కాకపోయినా, సాధారణ జీర్ణ ప్రక్రియలో భాగం అయినప్పటికీ, శరీర ఆరోగ్యాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది.
ఇది ఉబ్బరం, కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి మరియు కడుపు భారం వంటి సమస్యలను సృష్టిస్తుంది. గ్జీయాస్ర్ణ వ్యవస్థలో గ్యాస్ పేరుకుపోయే ఈ పరిస్థితిని అపానవాయువు అంటారు జీర్ణవ్యవస్థ పేగులలో అధికంగా వాయువును ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు హైడ్రోజన్ మిశ్రమం,
జీర్ణక్రియకు కావలసిన ఆమ్లాలు సరిపోనప్పుడు మసాలా ఆహారాలు తినడం, ఆహారాన్ని సరిగ్గా నమలకపోడం, ఒత్తిడి, అలర్జీ మరియు అధికంగా మద్యపానం సేవించడం మొదలైనవి గ్యాస్ సమస్యలకు కారణం అవుతాయి. అంతేకాదు వేళకు తినకపోవడం కూడా గ్యాస్ సమస్య మొదలవ్వడానికి కారణం అవుతుంది.
Home Remedies For Gastric Problem In Telugu 2021
గ్యాస్ మరియు ఉబ్బరం వదిలించుకోవడానికి అద్బుతమైన ఇంటి చిట్కాలు మీకోసం.
◆ అల్లం, ఏలకులు మరియు సోపు

అల్లం ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. దీని విలువ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. తలనొప్పి, కడుపు నొప్పి మరియు గొంతు నొప్పి వంటి వ్యాధుల చికిత్సకు ఇంటి చిట్కాలలో అల్లం విరివిగా ఉపయోగిస్తారు.
ఇది గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు అజీర్ణానికి ఎక్కువమంది వాడేది అల్లంనే. మరి అల్లంతో అవాక్కయ్యే చిట్కా అల్లం టీ.
ఒక టీస్పూన్ దంచిన అల్లం, ఒక టీస్పూన్ ఏలకులు మరియు సోపు గింజల ను తీసుకోవాలి. అన్ని పదార్ధాలను ఒక కప్పు నీటిలో కలపి కొద్దిగా మరిగించాలి. దీన్ని వడగట్టి చిటికెడు ఇంగువ కలపాలి.
ఈ పానీయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు త్రాగాలి. సరైన జీర్ణక్రియకు మరియు కడుపులో గ్యాస్ ఉత్పత్తిని నియంత్రించడానికి ఇది ఎంతో దోహాధం చేస్తుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకునేవాళ్ళు అల్లం ముక్కను కూడా నమలవచ్చు.
◆ వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర

గ్యాస్ సమస్యకు చికిత్స చేయడానికి వెల్లుల్లి మరొక ఎంపిక. వెల్లుల్లిలో గొప్ప రోగనిరోధక శక్తి గుణాలు ఉంటాయి. వెల్లుల్లిని తరచుగా వాడేవాళ్ళలో జీర్ణ సంబంధ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయన్నది కాదనలేని వాస్తవం. వెల్లుల్లిని మనం రోజూ తీసుకునే ఆహారంలో వివిధ రకాలుగా జోడించవచ్చు.
వెల్లుల్లి మరియు నల్ల మిరియాలు సూప్
ఒక కప్పు నీరు తీసుకొని మరిగించాలి. వెల్లుల్లిని కాస్త దంచుకోవాలి. దంచిన వెల్లుల్లి, నల్లమిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడికించాలి. ఇందులో స్పూన్ కార్న్ ఫ్లోర్ ను కొన్ని నీళ్లలో కలిపి మరుగుతున్న మిశ్రమంలో కలపాలి.
కొద్దినిమిషాలలో మిశ్రమం చిక్కబడుతుంది. రుచికి తగినంత ఉప్పు కలుపుకుని దించేసి వేడివేడిగా తీసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కలపకుండా దీన్ని మాములు పానీయంగా కూడా తీసుకోవచ్చు. దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు గ్యాస్ సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాలి.
◆ వాము

వాము గ్యాస్ సమస్యకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.. వాము విత్తనాలలో ఉండే థైమోల్ గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది, ఇది ఆహారం సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
వాము ఉపయోగించే విధానం
విధానం: అర టీస్పూన్ గింజలను తీసుకొని ఒక కప్పు నీటితో గల్ప్ చేయండి. గ్యాస్ నుండి ఉపశమనం పొందడానికి రోజుకు ఒకసారి ఇలా చేయండి.
◆ మజ్జిగ

మజ్జిగ కడుపులో పుట్టే వాయువుకు అద్భుతమైన నివారణ. గ్యాస్ వల్ల ఎదురయ్యే మంట ను నివారించడంలో మజ్జిగ అద్భుతాలు చేస్తుంది. ఇందులో ఉండే బాక్టీరియా జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించి గ్యాస్ ను అదుపులో ఉంచుతుంది. మరియు ఇది మీ కడుపుని శాంతపరుస్తుంది.
మజ్జిగతో మ్యాజిక్ చిట్కా
పెరుగులో నీళ్లు దండిగా పోయాగానే మజ్జిగ అయిపోదు. కవ్వంతో బాగా చిలికి విన్నాను తీసేయగా వచ్చేది మజ్జిగ. ఇందులో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు.
ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని అందులో చిటికెడు నల్ల ఉప్పు, కొద్దిగా వాము పొడిని కలపాలి. గ్యాస్ సమస్య తగ్గించుకోవడానికి ఈ మజ్జిగను రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
◆ఉడికించిన గుమ్మడికాయ

గుమ్మడికాయ కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని, గ్యాస్ సమస్య ఉన్నపుడు దాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
గుమ్మడికాయతో గమ్మత్తైన చిట్కా
ఒక కప్పు గుమ్మడికాయ తీసుకొని ఆవిరి మీద ఉడికించాలి. దీనివల్ల గుమ్మడిలోని నీటిశాతం, పోషకాలు కూడా నష్టం కావు. ఇలా ఉడికించిన గుమ్మడిని ప్రతిరోజు తినవచ్చు. లేదంటే గుమ్మడిని పులుసు, కూరలాగా కూడా చేసుకుని తినవచ్చు. ఉడికించిన గుమ్మడిని చెరకు పాకంలో ముంచుకుని తినడం ప్రాచీన ఆహారంలో ఒక పద్ధతి.
◆ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీరు

ఆపిల్ సైడర్ వెనిగర్ అపానవాయువుకు మరో ఔషధంగా చెప్పవచ్చు. ఇది గ్యాస్ కు అద్భుతంగా చికిత్స చేస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆపిల్ సిడెర్ వెనిగర్ ను కూడా ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు.
ఒక గాజు సీసాలో 150 గ్రాముల పంచధార, రెండు యాపిల్స్, రెండు స్పూన్ల సాధారణ వెనిగర్. ఈ మూడింటిని వేసి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి దాదాపు 2 లేదా3 వారాలు అలాగే నిల్వ ఉంచాలి. వాసన కాస్త ఇబ్బంది కలిగించేలా ఉన్నా, ఇది గొప్ప పలితాన్ని ఇచ్చే ఔషధం.
ఆపిల్ సైడర్ వెనిగర్ తో సింపుల్ చిట్కా
గ్లాసుడు గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటిని రోజు ఉదయాన్నే తాగడం వల్ల రోజు మొత్తం ఎలాంటి సమస్య లేకుండా గడిచిపోతుంది.
◆ నిమ్మకాయ

నిమ్మకాయ జీర్ణక్రియకు సహాయపడుతుందనే విషయం మనకు తెలిసిందే. కాస్త కడుపు వికారం అనిపించినా, నలతగా అనిపించినా పెద్దోళ్ళు చెప్పే మొదటి మాట నిమ్మకాయను వాడమని చెప్పడం.
ఎందుకంటే ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడటానికి ప్రేరేపించే ఆమ్లాన్ని కలిగి ఉంటుంది, ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. గ్యాస్ మరియు దాని ద్వారా ఎదురయ్యే కడుపు ఉబ్బరం సమస్యలో నిమ్మకాయ కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
నిమ్మకాయతో నమ్మలేని పలితాన్నిచ్చే చిట్కా
గ్లాసుడు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. నిమ్మరసానికి బదులుగా మూడు నిమ్మకాయ చెక్కలను కూడా నీళ్లలో జోడించవచ్చు. దీన్ని బాగా కలిపి ఒక 5 నిమిషాలు తరువాత ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.