అవిసె గింజలు – ఉపయోగాలు, దుష్ప్రభావాలు

Flax seeds In Telugu – అవిసె గింజలు : నేడు మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో సహాయపడే చక్కటి పదార్దాన్ని గురించి తెలుసుకుందాం. అవి మరింకేమో కావండి , అవిసె గింజలు. ఈ అవిసె గింజలు చూడటానికి చిన్నగా కనిపించినా కానీ, మన శరీరంలో కలిగే ఎన్నో పెద్ద సమస్యలను సైతం పో గొట్టగలిగే మంచి ఔషధంగా పని చేస్తాయి.

కన్నీటి బింధువు ఆకారం లో కనిపించే ఈ అవిసె గింజలు, మనకు కన్నీరు కలిగించే ఎన్నో సమస్యలను ఎలా తొలగిస్తాయో ఈ సమాచారం లో తెలుసుకుందాం. ఇందులో మనం ఏమేమి అంశాల గురించి తెలుసుకోబోతున్నామంటే?

  • అవిసె గింజలు అంటే ఏంటి?
  • వీటివల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి?
  • అవిసె గింజలను మనం ఎలా తీసుకోవాలి?
  • సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఇంకెందుకు ఆలస్యం విషయంలోకి వచ్చేద్దాం…

What Are Flax Seeds In Telugu ? అవిసె గింజలు అంటే ఏంటి?

Flax-seeds-in-telugu
Flax seeds in telugu

అవిసె గింజలు, అవిసె అనే ఒక పుష్పించే మొక్క నుండి వస్తాయి. ఈ మొక్క లినసియే అనే కుటుంబానికి చెందిన మొక్క. దీన్ని లీనం ఉసిటాటిస్సిమం అనే  శాస్త్రీయ నామంతో పిలుస్తారు. అవిసె గింజలు అనేది ఒక ప్రాచీనమైన ఫైబర్ పంట, అదే పీచు పదార్ధమండి. వీటి వల్ల కలిగే మంచి ఉపయోగాల వల్ల వీటిని ఎన్నో శతాబ్దాలు నుండి పండిస్తూనే ఉన్నారు.

దీనిని మామూలుగా లిన్ సీడ్ ( Linseed ) అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు.ఇవి రూపంలో నిండు గోధుమ రంగు లేక లేత గోధుమ రంగు కలిగి ఉంటాయి. వీటిని ముఖ్యంగా యూరోప్, ఆసియా, మెడిటెర్రనియన్ వంటి ప్రదేశాలలో పండిస్తారు. అంటే వీటిని సమశీతోష్ణ వాతావరణంలో పండిస్తారు. ఇవి ముందుగా మెడిటెర్రనియన్ లో ఆరంభమయ్యాయి.

కెనడా అనే దేశం అవిసె గింజలను ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానం లో ఉంది.  ఇవి కన్నీటి బింధువు ఆకారం కలిగి ఉంటాయి. ఈ అవిసె గింజలు ఒమేగా-3 ఫాట్టి యాసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, ఐరన్, మెగ్నీసియం వంటి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి.

Flax Seeds Benefits In Telugu : అవిసె గింజలు – ఉపయోగాలు

ఇప్పుడిక మన అవిసె గింజలు వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం. ఈ క్రింద చెప్పబడినవన్నీ ఈ అవిసె గింజల యొక్క ఉపయోగాలు:

  • అవిసె గింజలు ఒక్క టేబుల్ స్పూన్ లో:
  • 37 గ్రాముల కాలరీస్
  • 1.3 గ్రాముల ప్రోటీన్స్
  • 2 గ్రాముల కార్బ్స్
  • 1.9 గ్రాముల ఫైబర్
  • 3 గ్రాముల కొవ్వు పదార్ధం(ఫాట్)
  • 0.3 గ్రాముల సాట్యురేటెడ్ ఫాట్
  • 0.5 గ్రాముల మోనోఅన్సాట్యురేటెడ్ ఫాట్
  • 2.0 గ్రాముల పోలిఅన్సాట్యురేటెడ్ ఫాట్
  • 1,597 మిల్లీ గ్రాముల ఒమేగా-3 ఫాట్టి యాసిడ్స్
  • రోజువారీ తీసుకోవలిసిన 100% విటమిన్స్ బి1, బి6 మనకు వీటి నుండే 12 % లభిస్తాయి .
  • రోజువారీ తీసుకోవలిసిన ఫోలేట్ లో మనకు దీని నుండే 2% లభిస్తుంది.
  •  అలాగే రోజువారీ తీసుకోవలిసిన కాల్షియం లో 2%, ఐరన్ లో 2%, మెగ్నీషియంలో 7%, ఫాస్ఫరస్ లో 4%, పొటాషియం లో 2% మనకు ఈ ఒక్క టేబుల్ స్పూన్ లోనే లభిస్తాయి.
  • అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 ఫాట్టి యాసిడ్స్, లైగన్స్ మరియు పీచు పదార్ధం మనకు ఎంతగానో సాయపడతాయి.
  • మనకు కావలిసిన ఒమేగా-3 ఫాట్టి యాసిడ్స్ మనం చేపలను తింటేనే లభించదు. ఈ‌ అవిసె గింజలను తిన్నా సరిపోతుంది. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఈ అవిసె గింజలు తిని ఒమేగా-3 ఫాట్టి యాసిడ్స్ ని చక్కగా తీసుకోవచ్చు.
  • వీటిలో ముఖ్యంగా ఆల్ఫా-లీనోలేనిక్ యాసిడ్ (ALA), అంటే మొక్కకు సంబంధించిన ఒమేగా-3 ఫాట్టి యాసిడ్స్ కలిగి ఉంటుంది.
  • ఈ ఆల్ఫా-లీనోలేనిక్ యాసిడ్ అనేది మన డైట్ లో ఉండవలిసిన రెండు యాసిడ్స్ లో ఒకటి.ఎందుకంటే మన బోడి తనంతట తానే వీటిని ఉత్పత్తి చెయ్యలేదు.
  • సైంటిస్ట్స్ జంతువుల మీద పరిశోధనలు చేసి ఈ ఆల్ఫా-లీనోలేనిక్ యాసిడ్ అనేది వాటి గుండెకు సంబంధించిన రక్తనాళాలలో కోలేస్ట్రోల్ డిపోజిట్ అవ్వకుండా ఆపుతుంది అని కనుగొన్నారు.
  • ఈ ఆల్ఫా-లీనోలేనిక్ యాసిడ్ తీసుకుంటున్నవారు హార్ట్ స్ట్రోక్ కి తక్కువ గా గురి అవుతున్నారు. అంతే కాకుండా ఇవి ధమనుల వాపు రాకుండా ఎంత గానో తోడ్పడతాయి, మరియు కాన్సర్ పెరగకుండా సహాయపడుతుంది.
  • ఈ ఆల్ఫా-లీనోలేనిక్ యాసిడ్ ఎక్కువ తీసుకుంటున్న వారిలో హార్ట్ రిస్క్ చాలా తక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
  • వీటిలో లైగన్స్ అనే నూట్రియెంట్స్ ఉంటాయి. అవి యాంటీ-ఒక్సిడంట్స్  మరియు ఈస్ట్రోగెన్ వంటి గుణాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల పౌరుష గ్రంధి క్యాన్సర్ ( Prostate Cancer ) మరియు రొమ్ము కాన్సర్(breast cancer), ఇంకా ఇతర రకాల కాన్సర్స్ రాకుండా ఉంటాయి.
  • ఇవి జీర్ణ శక్తిని మెరుగు పరచటంలో మంచి పాత్రను పోషిస్తాయి.
  • అవిసె గింజలు హై బి‌పి ని తగ్గించటంలో సహాయపడతాయి.
  • ఇవి మాంసం తినని వారికి మంచి ప్రోటీన్ ఆహారంగా ఉపయోగపడతాయి.
  • డయాబెటిస్ ఉన్నవారు ఇవి తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్ తగ్గించటంలో సాయపడుతుంది.
  • మన ఆకలిని కంట్రోల్ చేస్తూనే మన బరువును మేనేజ్ చేస్తుంది.
  • వీటితో మనం ఎన్నో రెసిపీస్ కూడా ట్రై చెయ్యొచ్చు.

ఇవండి అవిసె గింజల ( Flax seeds In Telugu ) వల్ల లాభాలు.

How To Eat Flax Seeds In Telugu : ఈ అవిసె గింజలను ఎలా తీసుకోవాలో చూద్దాం

Flax-seeds
Flax-seeds
  • ఈ అవిసె గింజలను పొడి చేసి రోజుకు ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో కానీ, అన్నం లో కానీ కలిపి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  • అవిసె గింజలను మనం పొడి పదార్ధంగా తీసుకోవటం మంచింది. ఎందుకంటే ఇవి పొడి చేయకుండా విడిగా తీసుకున్నట్లైతే వాటి పైన మందపాటి లేయర్ ఉండటంతో అవి జీర్ణమవ్వకుండా ఉండే అవకాశం ఉంది. వీటిని విడిగా తీసుకుంటే వాటిలోని  పోషక విలువలను మనం పొందలేము. అందుకే వీటిని పొడి చేసి అన్నంలో కానీ నీటిలో కానీ కలిపి తీసుకోవచ్చు.
  • వీటిని మనం కూరల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. కూరలు వండిన తరువాత వాటిని చల్లార్చి దాని మీద ఈ పొడి చల్లి మనం వీటిని ఉపయోగించవచ్చు.
  • వీటిని మనం సలాడ్స్ లో కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా పెరుగులో కూడా మనం దీనిని వేసుకోవచ్చు.
  • పిల్లలు దీనిని ఇష్టపడరు అని అనుకుంటే చపాతీ పిండిలో ఒకరికి ఒక స్పూన్ చొప్పున కలిపి తీసుకోవచ్చు.
  • అంతే కాకుండా వీటికి కొంచెం మిర్చి, కరివేపాకు కలిపి మనం కారప్పొడిగా చేసుకొని కూడా భోజనం చేసే ముందు ఒక స్పూన్ చొప్పున తీసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల ఇందులోని ఫైబర్ ఆకలిని తగ్గించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది.
  • మలబద్దకం ఉన్నవారెవారైనా ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో, ఒక స్పూన్ ఈ పొడి వేసి తీసుకుని రెస్ట్ తీసుకున్నట్లైతే జీర్ణం ఫ్రీగా అవుతుంది. ఇలా జీర్ణం ఫ్రీగా  అవ్వడం వల్ల స్కిన్ కూడా గ్లో అవుతుంది.

Flax Seeds Side Effects In Telugu : అవిసె గింజలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్

ఇలా ఎన్నో రకాలుగా ప్రతిరోజూ మనం ఈ అవిసె గింజలను తీసుకూవటం ఎంతో మంచిది. వీటి వల్ల మంచి జరుగుతుంది కదా అని వీటిని ఎక్కువగా తెస్సుకోవటం మాత్రం అంత మంచిది కాదు. వీటిని ఎక్కువగా తీసుకున్నట్లైతే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కు గురి కావలిసి వస్తుంది. కనుక దీనిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ అవిసె గింజలను తీసుకోవాలి.

సోపు గింజలు : ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

ఇక ఇప్పుడు వీటి వల్ల కలిగే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. క్రింద చెప్పబడినవన్నీ ఈ అవిసె గింజలు యొక్క సైడ్ ఎఫ్ఫెక్ట్స్:

  • వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల జీర్ణసమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  • దీనిలో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైయేరియా, గ్యాస్ వంటి ఉదర సమస్యలు ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ అరిగించే హార్మోన్స్ మరియు ఎంజైమ్స్ మన శరీరం లో లేకపోవటం వల్ల వీటిని అరిగించటానికి మన శరీరం కొంచెం ఇబ్బంది పడొచ్చు. దీనికి పరిష్కారం ఏంటంటే వీటిని మనం లిమిట్ గా తీసుకోవటమే.
  • డైలీ 5 నుండి 10 గ్రాముల అవిసె గింజలు మనం తీసుకోవచ్చు.అంతకుమించి తీసుకున్నట్లైతే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయి. ఇవి ఇమ్మునిటీని పెంచేవి కనుక లిమిట్ గా మనం వీటిని తీసుకోవచ్చు.
  • ఉడికించని మరియు వేయించని అవిసె గింజలు ఫుడ్ పోయిజన్ వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అంతే కాకుండా ఇవి గర్భిణిలకు కూడా ఇబ్బందులు తెచ్చి పెడతాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్ లా పనిచేయటం కారణంగా ఈ గర్భంపై సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఋజువులు లేవు. ఏ విధమైన ఋజువులు లేకపోయిన సమస్యలు తప్పవు అని నిపుణులు వాదిస్తున్నారు.
  • బ్లీడింగ్ మరియు డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
  • వీటిని సరిపడినంత ధ్రవ పదార్ధంలో తీసుకోకపోయినట్లైతే పేగు సమస్యలకు దారి తీస్తుంది.
  • Avise Ginjalu వల్ల అలెర్జీ కి ఆస్కారం ఉంది. అంతేకాక శ్వాసలో సుధీర్గ అవరోధం, అల్ప రక్తపోటు, వికారం, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • గర్భం కోసం చూసేవారు, మరియు గర్భధారణ చేసినవారు వీటికి దూరంగా ఉండటం మంచింది అని వైద్యులు చెబుతున్నారు.

ఇటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ మనకు వీటి వల్ల కలిగే అవకాశం ఉంది. పైన చెప్పిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ అవిసె గింజలు ( Flax Seeds In Telugu ) లిమిట్ లో తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని మనవి. దీన్ని చదవటానికి వెచ్చించిన సమయం వృధా కాలేదని భావిస్తున్నాము…..

Leave a Comment