మెంతులు ఎలా వాడాలి ? ఉపయోగాలు ఏంటి ?

Fenugreek Seeds In Telugu Meaning : మెంతులు

మెంతులు చూడటానికి పసుపు గోధుమ రంగులలో కలగలిసి మంచి సువాసనను కలిగి ఉండే వంటింటి దినుసు. చేదు రుచిని కలిగి నానబెట్టిన తరువాత జిగురు స్వభావాన్ని కలిగివుండే ఈ మెంతులు ఆరోగ్య పరంగా గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ఆవకాయ పచ్చళ్ళు, వివిధ రకాల వంటలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. మెంతి పిండి వేయని ఆవకాయ కనిపించదు. ఇక మెంతులను నాటడం ద్వారా లభ్యమయ్యే మెంతికూర ఆకుకూరల్లో ప్రసిద్ధి చెందినది. ఈ మెంతి కూరతో బోలెడు రకాల వంటలు చేసుకోవచ్చు.

వీటిలో  ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

How To Eat Fenugreek Seeds In Telugu : మెంతులు ఎలా వాడాలి ?

మెంతులు వంటల్లో ఉపయోగించవచ్చు. వీటిని సాధారణంగా నేరుగా కాకుండా పొడి రూపంలో ఎక్కువగా వాడతారు. అలాగే వీటిని నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతారు.  ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లతో కొద్దిగా మెంతి పొడిని కలిపి తీసుకోవచ్చు.

మెంతులు జుట్టు సంరక్షణలోను ఆరోగ్య సంరక్షణలోనూ విరివిగా ఉపయోగిస్తారు. 

Fenugreek Seeds Benefits In Telugu : మెంతులు ఉపయోగాలు

మన దేశంలో ఎంతోమంది ఉపయోగిస్తున్న ఆయుర్వేదం మంద్దుల్లో సోపు గింజలు , జీలకర్ర, అవిసె గింజలు , నువ్వులు లాంటివి ఎన్నో వాడుతున్నారు. మరి వీటిని ఎంత మోతాదులో వాడలో క్లుప్తంగా వివరించాను. ఇపుడు మెంతులు వాడటం వల్ల ఉపయోగాలు చూద్దాం. మెంతులు వాడటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది

fenugreek seeds benefits for diabetes
fenugreek seeds benefits for diabetes

 మధుమేహం ఉన్నవారు ఆరోగ్యాన్ని కాపాడుకొని రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మెంతులు మంచి ఎంపిక. టైప్-2 డయాబెటిస్ తగ్గించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి.  అలాగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 

బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచుతుంది

fenugreek seeds benefits for mother
fenugreek seeds benefits for mother

 మెంతి గింజలను వంటింటి చిట్కాగా తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.  వీటిలో ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. దీనికోసం మెంతులు నీటిలో వేసి మరిగించి  మెంతి టీ తయారుచేసుకుని తాగడం వల్ల తల్లులలో  పాల సరఫరా పెరుగుతుంది

జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది

మహిళలు తీసుకునే జాగ్రత్తల్లో జుట్టుపెరుగుదల కోసం పాటించే చిట్కాలు బోలెడు ఉంటాయి. తలకు పెట్టుకునే కొబ్బరి నూనెలో గుప్పెడు మెంతులు వేసి మరిగించి చల్లగా అయిన తరువాత వడగట్టి ఒక గాజు సీసాలో ఆ నూనెను భద్రపరుచుకోవాలి.

దీన్ని వారంలో రెండు లేదా మూడు సార్లు జుట్టుకు కుదుళ్లకు ఇంకెలా మెల్లగా మర్దనా చేస్తూ అప్లై చేసుకోవాలి. దీనివల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది, చుండ్రు, దురద, తెల్ల వెంట్రుకలు వంటివి తగ్గిపోతాయి.

ఇంకా మెంతులు నానబెట్టి పెరుగు, నిమ్మరసం కలిపి బాగా గ్రైండ్ చేసి తలకు హెయిర్ పాక్ వేసుకోవచ్చు. మంచి పోషనను అందివ్వడమే కాకుండా పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది.

చర్మ సంరక్షణలో తోడ్పడుతుంది

చాలామంది అమ్మాయిలకు నునుపైన చర్మం ఒక కల. అలాగే చేతులు కాళ్ళు మీద మచ్చలు, ముఖం మీద మొటిమల తాలూకూ గుర్తులు ఇవన్నీ అమ్మాయిలను ఇబ్బంది పెడతాయి. అలాంటివాళ్ళ స్పూన్ ముల్తానీ మట్టి, స్పూన్ మెంతి పిండి, స్పూన్ శనగపిండి తీసుకుని అందులో స్పూన్ పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా పేస్ట్ చేసి ముఖానికి, చేతులకు, కాళ్లకు పాక్ లాగా వేసుకోవాలి.

ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఎలాంటి బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

నెలసరి సమస్యలను తగ్గిస్తుంది

 మెంతి గింజలు నెలసరిలో కడుపులో కండరాల తిమ్మిరిని, అలాగే కడుపు నొప్పిని తగ్గిస్తాయి. అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ లో ఉండేలా చేస్తాయి.    మెంతి విత్తనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాలు ఉన్నాయి, అందువల్ల ఇవి నెలసరి సమస్యలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించి సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడతాయి. 

బెస్ట్ రిలీఫర్ గా పనిచేస్తుంది

 మెంతులను పొడిగా చేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల. శరీరం అలసట, తలనొప్పి మరియు వికారం వంటి లక్షణాలను గణనీయంగా తగ్గిస్తుంది.

గుండెపోటును నివారించండి

 మెంతులు తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల గుండెపోటు సమయంలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. తద్వారా గుండెపోటు వల్ల మనిషికి ప్రాణహాని జరగకుండాచేస్తాయి. 

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

 మెంతి గింజలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి ఎంతో బాగా సహాయపడతాయి.  ముఖ్యంగా మన శరీరంలోని ‘చెడు’ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి. మెంతి గింజల్లో నరింగెనిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో లిపిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు సహాయం చేస్తుంది

 కడుపు సంబంధ సమస్యలతో  బాధపడేవారికి మెంతులు ఒక వరం.  ఇది కడుపులో అల్సర్ పుండ్లు మరియు అజీర్ణానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఇంఫులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే కడుపు పూతల వల్ల ఏర్పడే జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది.  

 ◆ బరువు తగ్గడంలో సహాయం

 బరువు తగ్గాలంటే, ఆహారంలో మెంతి గింజలను చేర్చడం తప్పనిసరి.  మెంతి విత్తనాలు కొవ్వు పేరుకుపోవడాన్ని నివారించడంలో సహాయపడతాయి మరియు బరువు తగ్గడానికి సహాయపడే లిపిడ్లు గ్లూకోజ్ తొందరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.   

 ◆ కాలేయాన్ని రక్షిస్తుంది

 కాలేయం శరీరంలోని విషాన్ని శుభ్రపరుస్తుంది.  కాలేయానికి కలిగే ఇన్ఫెక్షన్లు మరియు గాయాలు   ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.  కాలేయ పనితీరు తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి అధిక మద్యపానం.  ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు కాలేయంపై ఆల్కహాల్ ప్రభావాన్ని నియంత్రించడం కోసం మెంతులు ఉపయోగించవచ్చు.

దీనివల్ల ఆల్కహాల్ ప్రభావం నుండి కాలేయానికి రక్షణ కల్పించినట్టు అవుతుంది.  మెంతి గింజల్లో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కాలేయానికి జరిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Fenugreek Seeds Side Effects : దుష్ప్రభావాలు

◆రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడం ( హైపోగ్లైసీమియా ) లేదా  రక్తస్రావం జరిగేలా చేయడం లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు ఎదురవుతాయి. 

◆ మెంతులు గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితం కాదు. గర్భవతిగా ఉంటే వైద్య సలహా లేకుండా మెంతులు ఉపయోగించకూడదు. 

◆అలాగే పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వైద్యుల సలహాతో వీటిని తీసుకుంటే మంచిది. కొందరిలో ఇవి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి.  

◆మెంతులు పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు.

◆అనారోగ్య సమస్యలు దృష్ట్యా ఇతర మందులు వాడుతున్నపుడు మెంతులు తీసుకోకూడదు. 

Leave a Comment