సోపు గింజలు : ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

Fennel seeds In Telugu – సోపు గింజలు : మన నోటికి ఎంతో రుచిని కలిగించే ఈ సోపు గింజలు మనకు తాత్కాలిక ఆనందాన్నే కాదు, శారీరక ఆనందం కలిగించడంలోనూ ఎంతగానో తోడ్పడతాయి. అంటే ఈ సోపు గింజలు మనకు శారీరకంగా ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సోపు గింజలు మనకు ఏ విధంగా సాయపడతాయో ఈనాడు ఈ సమాచారం నుండి తెలుసుకుందాం.

What Are Fennel Seeds In Telugu ? సోపు గింజలు అంటే ఏంటి ?

ఆంగ్లంలో ఫెన్నెల్ అని పిలువబడే సోపు మొక్క నుండే మనకు సోపు గింజలు వస్తాయి. ఈ సోపు మొక్క యొక్క శాస్త్రీయ నామం ఫోనిక్యులమ్ వల్గరే. ఇది క్యారెట్ కుటుంబానికి చెందిన ఒక పుష్పించే మొక్క. ఈ మొక్క పసుపు రంగు పూలు మరియు గాలికి కొట్టుకుపోయే విధంగా ఉండే ఆకులను కలిగి ఉంటుంది. ఇవి ఏ కాలంలోనైనా ఉంటాయి.

ఇవి మొదటగా మెడిటెర్రనియన్ ప్రదేశానికి చెందిన మొక్క. తర్వాత ఇవి ప్రపంచమంతట విస్తరించాయి. ఇవి డ్రై సోయిల్స్ లో, తీర ప్రాంతాల్లో మరియు నదుల పక్కన పెరుగుతాయి. ఈ సో పు గింజలు సోపు మొక్క పూలు ఎండిపోయిన తర్వాత వాటిని క్లాత్ బ్యాగ్స్ లో తొడిగి సోపు గింజలు అందులో పడే విధంగా చూస్తారు. ఈ విధంగా సోపు గింజలు సోపు మొక్క నుండి వస్తాయి.

Fennel Seeds Uses In Telugu : సోపు గింజల వల్ల కలిగే ప్రయోజనాలు

Fennel seeds in telugu
Fennel seeds in telugu

ఈ సోపు గింజల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల కలిగే లాభాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.

సోపు గింజల వల్ల కలిగే లాభాలు: 

 • ఒక ఫ్రెష్ ఫెన్నెల్ బల్బ్ లో రోజువారీ మనకు కావలసిన విటమిన్ సి ‌లో 12%,కాల్షియం లో 3%, ఐరన్ లో 4%, మెగ్నీషియం లో 4%, పొటాషియం లో 8%, మాంగనీస్ లో 7% ఉంటాయి. అంతేకాక ఫైబర్ 3 గ్రామ్స్ మరియు 27 గ్రామ్స్ కాలోరీస్ ఉంటాయి.
 • ఒక టేబుల్ స్పూన్ సోపు గింజలలో 20 గ్రాముల కాలోరీస్, 2 గ్రాముల ఫైబర్, మరియు మనకి రోజువారీ కావలసిన విటమిన్ సి లో 1%, కాల్షియం లో 5%, ఐరన్ లో 6%, మెగ్నీషియం లో 5%, పొటాషియం లో 2%, మాంగనీస్ లో 17% లభిస్తాయి.
 • ఈ సోపు గింజలలో కాలోరీస్ తక్కువ మోతాదు లో ఉన్నా కానీ, మనకి ముఖ్యమైన నుత్రిఎంట్స్ని అవి మనకి అందిస్తాయి.
 • ఒక ఫ్రెష్ ఫెన్నెల్ బల్బ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్మ్యూనిటికి, టీష్యూ రెపైర్ కి, కొల్లజెన్ సింథెసిస్ కి ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా విటమిన్ సి అనేది యాంటీ-ఒక్సిడెంట్. ఇది మన శరీరం లోని సెల్స్ డామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి.
 • అంతేకాకుండా మాంగనీస్ మన ఎంజైమ్స్ యాక్టివేషన్ కి, మెటబొలిజ్మ్ కి , ఎముకల వృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.
 • సోపు మొక్కలోన ఉండే శక్తికరమైన యాంటీ-ఒక్సిడెంట్స్  మనకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
 •  సోపు గింజలు మన ఆకలిని తగ్గించటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఇంకా దీనిమీద పరిశోధన అవసరం.
 • ఇందులోని ఫైబర్, పొటాషియం మరియు కాల్షియం మన ఆరోగ్యానికి అవసరం.
 • ఇందులో యాంటీ-కాన్సర్ గుణాలు ఉన్నాయి అని పరిశోధకులు టెస్ట్-ట్యూబు మరియు జంతువులు నుండి పరిశోధన చేసి చెప్పారు. కానీ ఇవి మానవుల మీద కూడ అలాగే పనిచేస్తాయా అనేది ఇంకా మనకి తెలియాలిసి ఉంది.
 • ఇవి ఆడవారి లో పాల ఉత్పత్తిని పెంచవచ్చని స్టడీస్ తెలుపుతున్నాయి.
 • ఇందులో యాంటీ-బాక్టీరియా గుణాలు కలిగి ఉన్నాయి. అవి మెనోపాజల్ లక్షణాలను తొలగించటంలో సహాయపడతాయి.
 • వీటి నుండి తయారు చేసే సో పు ఆయిల్ అనేది జీర్ణ శక్తి సాయపడుతుంది. ఇధి మలబద్దకంపై కూడా మంచిగా పని చేస్తుంది.

ఈ విధంగా ఈ సో పు గింజలు మనకు సాయపడతాయి.

How To Eat Fennel Seeds In Telugu ? సోపు గింజలను ఎలా తినాలి ?

Fennel seeds in telugu 2021
Fennel seeds in telugu 2021

ఇప్పుడు వీటిని మనం ఎలా తీసుకోవాలో చూద్దాం:

 • సో పు గింజలు, జీరకర్ర, సైంధవలవణం వీటి పొడులను సమంగా తీసుకొని, పూతకు 1/2 టీస్పూన్ చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళకు కలిపు రోజుకు ఒక మూడు సార్లు తాగుతుంటే జీర్ణశక్తి పెరిగి అజీర్ణం సమస్య తగ్గుతుంది.
 • పూటకు ఒక టిస్పూన్ ఈ సో పు పొడిని మజ్జిగకు కలిపి, రోజుకు మూడు నుండి నాలుగు సార్లు తాగితే నీళ్ళ విరేచనాలు, జిగట విరేచనాలు తగ్గుతాయి.
 •  పూటకు ఒక టీస్పూన్ సో పు పొడిని మజ్జిగకు కలిపి, రోజుకు మూడు నుండి నాలుగు సార్లు తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 • ఆహారం తిన్న తర్వాత ప్రతీసారి, 1/2 టిస్పూన్ సో పు గింజలను నోటిలో వేసుకొని నమిలి తింటే నోటి దుర్వాసన అనేది కొద్దిగైన తగ్గుతుంది. 
 • వేయించిన సో పు గింజలు, మిరియాలు, ఉప్పు వీటి పొదులను పూటకు 1/2 టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు మజ్జిగ తో కలిపి తాగితే ఆకలి పెరుగుతుంది.
 • సో పును వేడి నీటిలో మరిగించి తర్వాత వడకట్టి ఆ నీటిని తీసుకున్నా మంచిదే.
⇒ అవిసె గింజలు - ఉపయోగాలు, దుష్ప్రభావాలు

పైన చెప్పిన విధంగా సో పు గింజలను తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు మరియు ఎన్నో సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.

Fennel Seeds Side Effects In Telugu : సోపు గింజలు దుష్ప్రభావాలు

సో పు గింజలు ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని మనం ఎక్కువ తీసుకోవటం మనకు అంత మంచిది కాదు. దీనిని లిమిట్ లో మన డైట్ లోకి చేర్చుకుంటే మనకు అధిక ఫలితాలనే ఇస్తుంది. 

ఇక ఇప్పుడు మనం ఈ  సో పు గింజల నుండి వచ్చే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. క్రింద చెప్పబడినవన్నీ సో పు యొక్క సైడ్ ఎఫ్ఫెక్ట్స్:

 • వీటిలో ప్రోలక్టిన్ అనే ఈస్ట్రోజెన్ కి సంబంధిత పదార్ధం ఉన్నందున గర్భవతులు వీటిని తీసుకోవటం అంతా మంచిది కాదు అనే నిపుణులు సూచిస్తున్నారు.
 • అంతే కాక ఓవరియన్ కాన్సర్, ఎండోమెట్రోసిస్ లేక ఉటేరిన్ ఫిబ్రోయిడ్స్ వంటి కండిషన్లు ఉన్నవారు వీటిని తీసుకూకపోవటమే మంచిది.
 • సో పు గింజల వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
 • అంతేకాకుండా ఛాతీ మరియు గొంతు బిగబట్టినట్లుండటం లేకపోతే ఛాతీ నొప్పి కూడా రావచ్చు.
 • వీటివల్ల వొమ్టింగ్, రాషెస్(మంట లేధ ఉబ్బిన చర్మం), దురద, ఉబ్బిన చర్మం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
 • ఇంకా దీని వల్ల వాంతు వచ్చేటట్లుండటం( నాసియా ), దద్దుర్లు( హైవ్స్ ) వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
 • వీటిని తీసుకోవటం వల్ల మన చర్మం సూర్యకాంతికి సెన్సిటివ్ గా ఉండేటట్లు చేస్తుంది. అంటే మన చర్మం సూర్యరశ్మి ని తట్టుకోలేకుండా ఉండేటట్లు చేస్తుంది.
 • ఈ సో పు గింజలు మనం తీసుకునే కొన్ని మందులపై వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సోపు గింజలను వాడే ముందు మన డాక్టర్స్ ను కన్సల్ట్ చేసి మనం వాడే మెడిసిన్స్ పై ఈ సోపు గింజలు ఎటువంటి ప్రభావం చూపవు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనం వీటిని మన డైట్ లోకి చేర్చుకోవాలి. లేకపోతే అవి మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవిగా పని చేస్తాయి.
 • ఈ సో పు గింజలను ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ తీసుకోవటం వల్ల “ప్రిమెచ్యూర్ తెలర్చే”  అనే సమస్యను ఎదుర్కుంటారు. అంటే వీటిలో ఉన్న ఈస్ట్రోజెన్ హార్మోన్ సంబంధిత ప్రోలక్టిన్ అనే పదార్ధం ఆడపిల్లల్లో వారు పెద్ద మనిషి కాక ముందే అంటే చిన్న వయసులోనే వారి రొమ్ము పరిమాణం అనేది పెరిగిపోతుంది. ఇది ఆడపిల్లకు చాలా పెద్ద సమస్య అని నిపుణులు చెపుతున్నారు. కనుక వీటిని ఆడపిల్లలు లిమిట్ లో చాలా తక్కువగా తీసుకోవటం చాలా మంచిది.

కనుక ఈ సోపు గింజల వల్ల కలిగే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ను దృష్టి లో పెట్టుకొని లిమిట్ లో వీటిని మీరు వీటిని తీసుకుంటె అవి మీకు లాభాన్నే కలిగిస్తాయి.

మరి ఇపుడు తెలిసింది కదా సోపు గింజలు ( fennel seeds in telugu ) మనకు ఎంతలా ఉపయోగపడుతాయో అని. వెంటనే వీటిని తినడం స్ఈటార్ట్ చేయండి. సమాచారం మీకు ఉపయూగపడిందని భావిస్తున్నాము.

Leave a Comment