జీలకర్ర ఉపయోగాలు తెలిస్తే ఇక వదలరు

Cumin Seeds In Telugu : జీలకర్ర 

జీలకర్ర రకాలు

 భారతదేశంలో ‘జీరా’ అని కూడా పిలువబడే జీలకర్ర భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే పదార్థం.  జీలకర్ర విత్తనాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది చెందినవి, వీటిని భారతీయ, పాకిస్తానీ, క్యూబన్ మెక్సికన్  మొదలైన వంటకాలలో ఉపయోగిస్తారు.

మార్కెట్లో లభించే జీలకర్ర మూడు రకాలు. తెల్ల జీలకర్ర, కాశ్మీరీ జీలకర్ర మరియు నల్ల జీలకర్ర.  తెల్ల జీలకర్రను వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

అంతేకాదు ఆయుర్వేద పరంగా కూడా జీలకర్ర ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తుంది. కాశ్మీరీ జీలకర్రను  షాజీరా అంటారు. దీన్ని ఖరీదైన వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక నల్లజీలకర్ర విత్తనాలు కలోంజి పేరుతో ఎంతో వైరల్ పదార్థాలలో ఒకటిగా నిలిచింది.  ఈ నల్లజీలకర్ర తీపి వాసన కలిగి ఉంటుంది. 

Cumin Seeds Health Benefits In Telugu : జీలకర్ర వల్ల లాభాలు

ప్రతివంటకానికి మంచి సువాసనను ఇచ్చే జీలకర్ర ఆరోగ్యపరంగా బెస్ట్ ఆప్షన్. ఇందులో సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.

జీలకర్ర వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే ఆరోగ్యాన్ని గొప్పగా రక్షించుకోవచ్చు. 

◆ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది

 జీలకర్రకు జీర్ణక్రియకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అజీర్తి చేసింది అంటే చాలు మన పెద్దలు కాసింత జీలకర్ర నమలమని చెబుతారు.  ఇందులో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. 

జీలకర్రలో థైమోల్ అనే నూనె పదార్థం ఉంటుంది. ఇది లాలాజల గ్రంథిని ప్రేరేపిస్తుంది.   బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు మంచి జీర్ణక్రియ కోసం మరియు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గడానికి తెల్లవారుజామున ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు.  

◆ బరువు తగ్గడానికి సహాయపడుతుంది

జీలకర్ర త్వరగా బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా రక్తంలో హానికరమైన లిపిడ్ల స్థాయిలను తగ్గించడం ద్వారా శరీరంలో మంచి కొవ్వులను తగినంత ఉండేలా చేస్తుంది.   

 ◆ క్యాన్సర్‌తో పోరాడుతుంది

జీలకర్ర కాన్సర్ కు కారణం అయ్యే  ఆల్డిహైడ్ కణితి పెరుగుదలను తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.

◆ నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది

సాధారణంగా నిద్రలేమికి కారణమయ్యే ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది.  

అంతేకాకుండా ఇందులో ఉండే మెలటోనిన్, నిద్రను నియంత్రించే హార్మోన్. శరీరానికి అవసరమైనంత నిద్రను అందించడానికి సహాయపడుతుంది.

అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ఐరన్ మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి మెదడుపై ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర కలిగేలా చేస్తాయి. 

◆ ఉబ్బసం మరియు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది

జీలకర్ర యొక్క శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు, ఉబ్బసం మరియు జలుబు చికిత్సకు ఎంతగానో తోడ్పడతాయి. 

శ్వాస మార్గాలలో నిండుకుపోయిన కఫం మరియు శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. జీలకర్రలో ఉండే నూనె పదార్థం అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

◆ జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది

జీలకర్రలో ఉండే ఖనిజాలు మరియు విటమిన్లు, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, జియాక్సంతిన్, మరియు నియాసిన్లతో నిండి ఉండటం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. 

జీలకర్ర మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మెదడు కణాలను పోషణ అందించడం  ద్వారా జ్ఞాపకశక్తిని పదునుపెడుతుంది.

◆ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

జీలకర్ర అలెర్జీలు, దద్దుర్లు, దురదలు మొదలైనవాటిని సమర్థవంతంగా తగ్గిస్తుంది.  

జీలకర్రలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియాను చంపడానికి మరియు మొటిమలను నయడానికి కూడా ఉపయోగపడతాయి.

జీలకర్ర నీటితో  ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ వ్యాధులు అరికట్టడమే కాకుండా, చర్మ మీద ఉన్న ముడుతలు, మచ్చలు వంయివి తొలగించుకోవచ్చు.

జీలకర్ర కషాయం ఎలా చేయాలి ?

కావలసిన పదార్థాలు

◆నీళ్లు: రెండు గ్లాసులు

◆జీలకర్ర :  స్పూన్

తయారీ విధానం

రెండు గ్లాసుల నీళ్లను ఒక గిన్నెలో తీసుకుని ఒక స్పూన్ జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి నీళ్లలో వేసి, గ్లాసుడు నీళ్లు మిగిలేవరకు మరిగించాలి.

తరువాత వడగట్టి గోరు వెచ్చగా ఉన్నపుడు ఆ నీటిని తాగాలి. దీనివల్ల బరువు తగ్గడం, జలుబు, అజీర్తి, శ్వాశ సమస్యలు అన్ని తగ్గుతాయి.

Cumin Seeds Side Effects In Telugu : దుష్ప్రభావాలు

Cumin Seeds
Cumin Seeds In Telugu

◆గుండెల్లో మంట

జీలకర్ర జీర్ణక్రియను ప్రోత్సహించడానికి  విడుదల చేసే వాయువు పేగుల్లోకి చొచ్చుకుపోయి అక్కడ మరింత పెరిగి అది గ్యాస్ పెరుగుదలకు కారణం అవ్వచ్చు. ఈ గ్యాస్ చాలా ఎక్కువైనపుడు గుండెల్లో మంట, గుండె పట్టేసినట్టు అవ్వడం వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి జీర్ణశక్తి కోసం జీలకఱ్ఱను అతిగా తినకూడదు. 

◆కాలేయం (లివర్) ను దెబ్బ తినెల చేస్తుంది.

 జీలకర్రను ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.  జీలకర్రలో ఉండే నూనె ఇమెదుకు కారణం అవుతుంది.  

◆అబార్షన్ కు దారితీస్తుంది

 జీలకర్ర గర్భిణీ స్త్రీలకు అబార్షన్ జరిగేలా చేయగలదు. గర్భవతులుగా ఉండి జీలకర్రను అధికంగా తినే వాళ్ళకు ఈ సమస్య ఎదురవుతుంది. 

◆డ్రగ్ లాగా పనిచేస్తుంది

 డ్రంగ్ అంటే మత్తు పదార్థం అని అర్గం. జీలకర్రలో ఈ లక్షణాలు ఉంటాయి.  జీలకర్రను రోజు తీసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇదొక వ్యసనంగా మరే అవకాశం ఉంటుంది. ఇలా తీసుకుంటే మానసికంగా ఒత్తిడి, వికారం, ఎప్పుడు మత్తుగా అనిపించడం జరుగుతుంది.  

◆ మహిళల్లో నెలసరి సమస్యలు పెంచుతుంది

 జీలకర్ర నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కలిగించవచ్చు. జీలకర్ర విత్తనాలను పెద్ద మొత్తంలో తీసుకుంటే మాములు రోజుల్లో కంటే నెలసరి సమయంలో రాజతం ఎక్కువగా కోల్పోతారు.   

◆ రక్తంలో చక్కెర స్థాయిలు అనుహ్యంగా తగ్గిస్తుంది

 జీలకర్రను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.  దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురుకావచ్చు. 

◆ మధుమేహం ఉన్నవాళ్లకు మంచిది కాదు

డయాబెటిస్ ఉన్నవారు వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.  అందుకని జీలకర్ర తీసుకుంటే పొరపాటే. సాధారణ చక్కెర స్థాయిలు కచ్చితంగా లేకపోతే సమస్య ఎదురవుతుంది.

కానీ జీలకర్ర ఈ స్థాయిలను అనూహ్యంగా తగ్గిస్తుంది ఇది ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు జీలకర్ర ఎక్కువ తీసుకోకూడదు. 

ఇది కూడా చదవండి :-

  1. సోపు గింజలు : ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
  2. అవిసె గింజలు – ఉపయోగాలు, దుష్ప్రభావాలు

Leave a Comment