అందమైన బుగ్గల కోసం చిట్కాలు
చబ్బీ చీక్స్ అని ముద్దుగా ఎవరైనా పిలిస్తే బలే సంతోషంగా ఉంటుంది. అంతే కాదు బొద్దుగా, గుండ్రంగా ఉండే బుగ్గలు చాలా ముఖాలకు యవ్వనంగా కనిపిస్తాయి, అయితే బుగ్గలు సాగిపోవడం, లోపలికి ఉన్నట్టు అనిపించడం వృద్ధాప్య ఛాయలకు సంకేతంగా పేర్కొనవచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ముద్దుగా, బొద్దుగా ఉన్న బుగ్గలు సొంతం చేసుకోవచ్చు. అపుడు వయసు ఎంత ఉన్నా చబ్బీ చీక్స్ అని ఆనందంగా అందరూ మిమ్మల్ని పిలుస్తారు.
చాలామంది కాస్త లగ్జరీ పీపుల్స్ అయితే ఇలా బుగ్గలు, ముక్కు, పెదవులు వంటివి చక్కని ఆకృతిలో ఉండటానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే సాధారణ ప్రజలకు అది సాధ్యం కాదుగా అందుకే చిట్కాలతో మ్యాజిక్ చేసి బూరెలాంటి బుగ్గలు సొంతం చేసుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని ఆహార పదార్థాలుగానూ, మరికొన్ని వ్యాయామాలు గానూ, ఇంకొన్ని ముఖానికి అప్లై చేసే పదార్థాలుగానూ ఇలా అన్ని కలిపి వాడాల్సి ఉంటుంది.
అందమైన బుగ్గలు బాగా పెరగాలంటే ఏం చేయాలి ?
◆ వ్యాయాయం

శరీరాకృతి లాగే ముఖంలో అవయవాల ఆకృతి సరిగా ఉండాలన్నా వ్యాయామం అవసరం. ప్రస్తుత ట్రెండ్ లో ఫేస్ యోగ ప్రముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. నెట్ లోనూ, యూట్యూబ్ లోనూ ఫేస్ యోగ వీడియోస్ విరివిగా అందుబాటులో ఉంటున్నాయి.
ప్రతిరోజు ఈ ఫేస్ యోగ ను ఫాలో అవుతుంటే కేవలం బుగ్గలు మాత్రమే కాదు, సాగిన ముఖ చర్మం బిగుతుగా మారుతుంది. ఫేస్ యోగా వల్ల ముఖ కండరాలు సంకోచం వ్యాకోచం సమర్థవంతంగా జరుగి, రక్తప్రసరణ బాగుంటుంది. దీనివల్ల ముఖం మీద కంటి కింద నల్లని వలయాలు కూడా క్రమంగా తగ్గుతాయి. ముఖం స్లిమ్ గా మారుతుంది.
◆ కలబంద తో కూల్ టిప్

చర్మం యవ్వనంగా ఉండేలా చేయడంలో కలబంద వండర్ చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉంటాయి. విటమిన్ ఇ సాగిన చర్మాన్ని టైట్ గా చేయడంలో చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజు తాజా కలబంద జెల్ ను బుగ్గల మీద పూస్తూ ఉంటే బుగ్గలు నునుపుగా, బొద్దుగా మంచి రంగులోకి మారతాయి. అలాగే తాజా కలబంద జెల్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల గొప్ప యాంటీ ఏజింగ్ సప్లిమెంట్ గా పనిచేస్తుంది. దీనివల్ల కేవలం బుగ్గలు మాత్రమే కాదు శరీరం కూడా యవ్వనంగా మారుతుంది.
◆ యాపిల్ మ్యాజిక్

యాపిల్స్ చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతాయి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కొల్లాజెన్, ఎలాస్టిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా అవ్వడానికి మరియు బుగ్గలు బొద్దుగా అవ్వడానికి ఉపయోగపడతాయి.
అందుకే చాలా మంది బొద్దుగా ఉన్న బుగ్గలను యాపిల్ బుగ్గలు అని కూడా అంటారు. చర్మానికి ఉన్న ఎలాస్టిక్ గుణాన్ని తిరిగి నిర్మించడంలో యాపిల్స్ సహాయపడతాయి. అందుకే యాపిల్స్ ను పేస్ట్ లా చేసి ముఖానికి, బుగ్గలకు పాక్ వేసుకోవడం వల్ల ఎర్రని, బొద్దుగా ఉన్న బుగ్గలు సొంతం అవుతాయి.
అలాగే యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్‌లు మరియు విటమిన్లు A, B, మరియు C ఉంటాయి. ముఖ కణజాలం దెబ్బతినకుండా నిరోధించడానికి యాపిల్స్ దోహదపడతాయి. యాపిల్ లోని కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ చర్మాన్ని మృదువుగా మరియు బొద్దుగా మారుస్తాయి
◆ గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్

సులువైన మరియు గమ్మత్తైన చిట్కా ఇది. రోజ్ వాటర్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఫేస్ పాక్ నుండి మేకప్ రిమోవర్ దాకా రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్తే రోజ్ వాటర్ కలపకుండా ఏది చేయరు కూడా.
ఇక గ్లిజరిన్ బెస్ట్ యాంటీ ఏజింగ్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్. నిద్రపోయే ముందు బుగ్గలపై రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ కలిపి రుద్దడం వల్ల చర్మాన్ని శుభ్రంగా మరియు హైడ్రేట్ గా వుంచుకోవచ్చు. అలాగే గులాబీ రంగు బుగ్గలు సొంతమవుతాయి కూడా.
ఇది కూడా చదవండి :- మీ చర్మం మిల మిల మెరవాలంటే ఈ టిప్స్ పాటించండి
◆ తేనె

తేనె సహజ మాయిశ్చరైజర్ గా పరించేస్తుంది. ఇందులోని మార్చరైజింగ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా సాగిపోయిన బుగ్గలు తిరిగి యవ్వన రూపాన్ని సంతరించుకుంటాయి.
తేనె మరియు బొప్పాయి గుజ్జును సమాన భాగాలుగా తీసుకుని స్క్రబ్ ల్లా రుద్దాలి. తరువాత పది నిమిషాలకు గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అదే విధంగా తేనెను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.
◆ పాలు

పాలు నీరు, కొవ్వు మరియు ప్రొటీన్‌ల మిశ్రమం. ఈ కారణంగా పాలను బుగ్గలకు పట్టించి మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఇది ముఖ చర్మపు నలువును తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అలాగే పాలలో అమైనో ఆమ్లాలు, కాల్షియం, రిబోఫ్లేవిన్, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ డి మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి పాలను ప్రతిరోజు తాగాలి.
◆ నూనె

చెంపల చర్మం బొద్దుగా గుండ్రంగా ఉండటానికి మసాజ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల నూనె తో సున్నితంగా మసాజ్ చేస్తూ ఉంటే అందమైన, ఆరోగ్యమైన బుగ్గలు సొంతమవడమే కాకుండా మెరిసే ముఖం సొంతమవుతుంది. అయితే ఈ మసాజ్ కోసం స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, అవకాడో ఆయిల్ వంటివి ఉత్తమమైనవి.
Note : ఈ సైట్ లో ఇచ్చే ప్రతీ చిట్కా మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దయచేసి డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోండి. అంతే కానీ ఎవరిని అడగకుండా ఎలాంటి ఆహారం, మందులు వాడకండి.
Also Read :- అందమైన జుట్టు కోసం ఆరోగ్యకరమైన చిట్కాలు