Carom Seeds In Telugu Meaning : వాము ( Ajwain Seeds In Telugu )
కొద్దిగా కారంగానూ, ఘాటును కలిగి ఉండే వంటింటి దినుసు వాము. సాంప్రదాయ పిండివంటల్లో భారతీయులు వామును విరివిగా వాడతారు. ఈ వాము కేవలం సువాసనను, రుచిని ఇవ్వడమే కాకుండా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
కాస్త జీలకర్రను పోలి జీలకర్ర కంటే కాసింత చిన్న పరిమాణంలో ఉండే వాములో అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు వాము ఫైబర్ కు గొప్ప మూలం.
Carom Seeds Benefits In Telugu : వాము ఉపయోగాలు
◆ బాక్టీరియా ను నిర్మూలిస్తుంది
వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే థైమోల్ మరియు కార్వాక్రోల్ అనే సమ్మేళనాలు దీనికి కారణం అవుతాయి. ఇవి బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తాయి.
◆ కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది
వామును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించవచ్చు. అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గుండె జబ్బులకు కారణం అవుతాయి.
◆ రక్తపోటును తగ్గిస్తుంది
అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు మరి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచే కారణాలలో ముఖ్యమైనది. కొన్నిరకాల మందులు వాడుతున్నపుడు అవి శరీరం కాల్షియం గ్రహించకుండా నిరోధిస్తాయి. ఇలా జరగడం వల్ల కాల్షియం గుండెకు అందకుండా నిరోధించబడుతుంది.
దీనివల్ల రక్తపోటు అనూహ్యంగా పెరుగుతుంది. వామును తీసుకోవడం వల్ల రక్తకణాలను ప్రభావితం చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
◆ పెప్టిక్ అల్సర్‌ను ఎదుర్కుంటుంది మరియు అజీర్ణాన్ని తొలగిస్తుంది
వామును సాధారణంగా ఆయుర్వేద వైద్యంలో జీర్ణ సంబంధ సమస్యలకు గృహ నివారణ ఔషధంగా ఉపయోగిస్తారు. వాములో దాగున్న సారం అన్నవాహిక, కడుపు లేదా చిన్న ప్రేగులో ఏర్పడే పుండ్లు మరియు పెప్టిక్ అల్సర్ల ను నయం చేస్తుంది.
అలాగే వాము గ్యాస్ మరియు దీర్ఘకాలిక అజీర్ణాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.
◆నొప్పులను తగ్గిస్తుంది
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా కారణంగా చాలా మంది తల నొప్పి, వాసన తెలియకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు వామును చితగ్గొట్టి కచ్చాపచ్చాగా ఉన్న వామును ఒక బట్టలో వేసి చిన్న మూటగా కట్టాలి.
దీన్ని దగ్గరే ఉంచుకుని అపుడపుడు వాసన చూస్తుంటే ఆశ్చర్యంగా తలనొప్పి, వాసన సామర్థ్యము పెరగడంతో పాటు ఎంతో బాధించే మైగ్రేన్ కూడా తగ్గుతుంది.
◆ ఆస్తమాకు వాము దివ్యౌషధం
ఆస్తమా చాలామందిలో సాధారణ సమస్య అయిపోతోంది. కానీ దాని ప్రభావం మనిషి రోజు మొత్తం మీద ఉంటుంది. అకస్మాత్తుగా శ్వాశ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోయే ఈ సమస్యను వాముతో కంట్రోల్ లో పెట్టచ్చు.
వామును రోజువారీగా తీసుకుంటూ ఉంటే శ్వాశ నాళాలు రిలీఫ్ అవుతాయి. సమస్య తగ్గుతుంది.
◆ చలికాలపు సమస్యలకు చెక్ పెడుతుంది
వాము మంచి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. చలికాలంలో మరియు వర్షాకాలంలో ఉధృతమయ్యే వైరస్ మరియు బాక్టీరియా వ్యాప్తి ద్వారా జ్వరం, ఫ్లూ, ఆహార కలుషితం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది.
కొద్దిగా వాము ను నోట్లో వేసుకుని మెలిగా నమిలి తిని, కొన్ని గోరువెచ్చని నీళ్లు తాగితే చాలు.
మరి ఇలాంటి ఆరోగ్యకరమైన అన్ని రకాల విత్తనాల గురించి మా ఈ తెలుగు నంది సైట్ లో విపులంగా రాయడం జరిగింది.అవేంటో మిరే చుసేయ్యండి.
How To Use Ajwain Leaves : వామును ఎలా వాడాలి??

◆ వాముని( ajwain in telugu ) వాడటంలో పెద్ద కష్టం ఏమి ఉండదు. నేరుగా నోట్లో వేసుకుని నమిలి తిని, వేడి నీళ్లు తాగచ్చు.
◆ ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడింటిని త్రిపలాలు అంటారు. వీటిని పొడి చేసి ఆ పొడితో వామును కూడా కలిపి కొద్దిగా తీసుకుంటూ ఉంటే పంటి సమస్యలు మొత్తం తగ్గిపోతాయి.
◆ ప్రతిరోజు కొద్దిగా వాము ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉంటే రక్తం శుద్ధి అవుతుంది.
◆ వామును నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని కొద్దీ కొద్దిగా తాగితే అజీర్ణంతో పాటు గొంతు నొప్పి, గొంతు గరగర తగ్గుతుంది.
◆ వామును జంతికలు, పకోడీలు, వాము టీ, వాము రైస్ ఇలా బోలెడు విధాలుగా వాడుకోవచ్చు.
Cumin Seeds Side Effects In Telugu : దుష్ప్రభావాలు ( Vaamu In Telugu )
◆ వాము వల్ల ఉపయోగాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.
◆ వాము జీనక్రియకు మంచిది కదా అని ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. దీనివల్ల జీర్ణాశయంలో ఆహారం గట్టిగా మారిపోయి అది పేగులలో ఇరుక్కుపోయి మలవిసర్జనను కష్టంగా మారుస్తుంది.
◆ ఇది రక్తాన్ని శుద్దిచేసే మాట వాస్తవమే అయినా అధికంగా తీసుకోవడం వల్ల వేడి కలిగించి ఫలితంగా గర్భవతుల్లో గర్భస్రావం జరగడానికి కూడా కారణం అవుతుంది.
◆ లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వామును తింటే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
◆ వాములో ఉండే ఒక రకమైన పదార్థం బ్లాక్ హెంబనే. ఇది మితంగా ఉంటే పర్వాలేదు కానీ ఎప్పుడైతే వాము ఎక్కువగా తింటారో అప్పుడు దీని ప్రభావం కూడా శరీరం మీద పెరుగుతుంది.
దీనివల్ల గుండె కొట్టుకునే ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేసి గుండె పోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలు కలుగచేయవచ్చు.
◆ ఇప్పటి తరానికి కడుపులో ఎసిడిటీ, అల్సర్ వంటివి సాధారణం అవుతున్నాయి. బయట ఆహారపదార్థాల మహిమ మరి. అయితే ఇలాటి వాళ్ళు వామును పరిధికి మించి తింటే సమస్యలు మరింత పెరిగి అవి ఆపరేషన్ల వరకు దారి తీయచ్చు.